గురుకులాల్లో బదిలీల్లేవ్..! ఆరేళ్లుగా ఒకే స్థానంలో సిబ్బంది తిప్పలు

by Shiva |
గురుకులాల్లో బదిలీల్లేవ్..! ఆరేళ్లుగా ఒకే స్థానంలో సిబ్బంది తిప్పలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోని గురుకు లాల్లో పనిచేస్తున్న ప్రిన్సిపాళ్లు, ఉపాధ్యాయులు, లెక్చరర్లకు ఏండ్లుగా బదిలీలు జరగడం లేదు. ఆరేండ్లకుపైగా పలువురు సిబ్బంది ఒ కే స్థానంలో కొనసాగుతున్నారు. తెలంగాణ ఏర్పాటుకు ముందు 2013లో, అనంతరం 2018లో బదిలీలు జరిగాయి. మళ్లీ ఇప్పటి వరకు ఆ అంశంపై సర్కార్ ఊసెత్తడం లేదనే విమర్శలు వస్తున్నాయి. దాదాపు 30 వేల మంది టీచర్లు ఇబ్బందులు పడుతున్నారు. ఒక్క సోషల్ వెల్ఫేర్‌లోనే సుమారు 10 వేల మంది ఉంటారని తెలుస్తోంది. బదిలీలపై గ త బీఆర్ఎస్ ప్రభుత్వం నిషేధం విధించడం తో ఈ ప్రక్రియకు ముందడుగు పడటంలేదు.

ముఖ్యమంత్రిపైనే ఆశలు

రాష్ట్రంలో సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్, బీ సీ వెల్ఫేర్, మైనా రిటీ వెల్ఫేర్, రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ సొసైటీ పేరిట గురుకులాలు ఉన్నాయి. అయితే, ఈ గురుకులాల్లో సిబ్బం ది లాంగ్ స్టాండింగ్ సమయం ఐదేండ్లు ఉం టుంది. కానీ ఇప్పుడు ఆరేండ్లు పూర్తి కావస్తున్నా బదిలీలు, పదోన్నతులు చేపట్టకపోవడంతో సిబ్బంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తెలంగాణ గురుకుల రిక్రూట్‌ మెంట్ బోర్డు ద్వారా కొత్తగా ఉపాధ్యాయు లు, ఉద్యోగుల నియామకాలు చేపట్టడానికి ముందే ప్రక్రియ పూర్తి చేయాలని కోరుతున్నారు. తెలంగాణ సాంఘిక సంక్షేమ గురు కుల పాఠశాలలు, జూనియర్ కళాశాలలు, డిగ్రీ కాలేజీల్లో పనిచేస్తున్న అన్ని కేడర్ల ఉపాధ్యాయులు, లెక్చరర్లు, ప్రిన్సిపాళ్లు, ఉద్యోగు ల బదిలీలు, పదోన్నతులు, విద్యాశాఖతో పాటే పూర్తి చేయాలని తెలంగాణ సాం ఘిక సంక్షేమ గురుకుల ఉపాధ్యాయ, ఉద్యోగుల సంఘం నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నారు. నూతన ఉ పాధ్యాయులు జాయిన్ అయితే సంస్థలో దీర్ఘకాలంగా మారుమూల ప్రాంతాల్లో పనిచేస్తున్న వారు అనువైన ప్రాంతాల్లో అవకాశం కోల్పేయే ప్రమాదముందని వాపోతున్నారు.

సీనియర్లకు నష్టం

ఎస్సీ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలోని సాం ఘిక సంక్షేమ గురుకులాల్లో పనిచేసే ఉ పాధ్యాయులు, అధ్యాపకులు, ప్రిన్సిపా ళ్లు, ఉద్యోగులు చాలా కాలం నుంచి ప్ర మోషన్లు పొందలేదు. దీంతో సీనియర్లు కొత్తగా రిక్రూట్ అయ్యే వారికంటే జూని యర్‌గా అయ్యే ప్రమాదం ఉంది. అందు కే కొత్త నియామకాలకు ముందుగానే పదోన్నతులు, బదిలీలు పూర్తి చేయాలి. - సీహెచ్ బాలరాజు, తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల ఉపాధ్యాయ, ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు

Next Story

Most Viewed