పవన్ కల్యాణ్‌ గురించి ఏమీ తెలియదంటూ విజయ్ సేతుపతి షాకింగ్ కామెంట్స్.. ఏమన్నారంటే!

by Hamsa |
పవన్ కల్యాణ్‌ గురించి ఏమీ తెలియదంటూ విజయ్ సేతుపతి షాకింగ్ కామెంట్స్.. ఏమన్నారంటే!
X

దిశ, సినిమా: పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌కు ఫ్యాన్స్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన కోసం ఎంతో మంది ఏం చేయడానికైనా రెడీగా ఉంటారు. అయితే ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మెగా ఫ్యాన్స్, సినీ ప్రముఖుల సపోర్ట్ విపరీతంగా ఉంది. ఆయన ఎన్నికల ఫలితాల్లో జనసేన పార్టీ 21 స్థానాల్లో పోటీ చేయగా.. అన్ని స్థానాల్లో అఖండ విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. దీంతో దేశ వ్యాప్తంగా పవన్ ఫ్యాన్స్ గ్రాండ్‌గా సంబురాలు చేసుకున్నారు.

అలాగే సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఆయనపై ప్రశంసలు కురిపించారు. ఈ క్రమంలో.. తాజాగా, కోలీవుడ్ స్టార్ విజయ్ సేతుపతి పవన్‌పై షాకింగ్ కామెంట్స్ చేశాడు. ‘‘నాకు పవన్ కల్యాణ్ గురించి ఏమీ తెలియదు కానీ నా వాట్సాప్‌లో కొందరు తెలుగు వ్యక్తులు పెట్టే పవర్ స్టార్ వీడియోలు చూశాను. అసలు ఏమైందని అడిగి తెలుసుకున్నాను. నిజానికి నాకు అసలు ఏం జరిగిందో తెలియదు. వాళ్లను అడగడం వల్ల చాలా విషయాలు చెప్పారు. పవన్ కల్యాణ్ కేవలం సినిమాల్లోనే కాదు బయట కూడా మాస్ అని అర్థమైంది.

ఆయనకి నా బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నాను. పవన్ కష్టాన్ని గౌరవిస్తాను.. ఆయన విజయం సాధించడం నాకు చాలా సంతోషంగా అనిపించింది. అయితే ఆయన ఎన్నికల్లో పోటీ చేసేటప్పుడు చాలా ట్రోల్స్ వచ్చాయని విన్నాను. వారికి స్ట్రాంగ్‌గా వార్నింగ్ ఇస్తూ తొడ కొట్టే వీడియో చూశాను. అప్పుడే అనిపించింది ఎవరైతే ట్రోల్స్, మీమ్స్ ఎదుర్కొని మానసికంగా ధృఢంగా ఉంటారో వారే విజయం పొందుతారు’’ అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం విజయ్ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతుండగా.. ఈ విషయం తెలిసిన వారంతా షాక్ అవుతున్నారు.

Next Story

Most Viewed