- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇండిపెండెంట్లకు ఏజెంట్లుగా BRS నేతలు..! KCR ఆదేశాల మేరకు నియామకం
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక కౌంటింగ్ వేళ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక కౌంటింగ్ వేళ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఫాంహౌస్ నుంచే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో ఫోన్‌లో గురువారం సంభాషించారు. కాంగ్రెస్ ఆగడాలకు పాల్పడే అవకాశం ఉందని, జాగ్రత్తగా ఉండాలని సూచించినట్లు తెలిసింది. ఏజెంట్లుగా వెళ్లే వారు అతి జాగ్రత్తతో ఉండాలని పేర్కొన్నారు. ఇద్దరు ఇండిపెండెంట్ అభ్యర్థులకు ఏకంగా బీఆర్ఎస్ నేతలను ఏజెంట్లుగా పంపించనున్నట్లు సమాచారం. దీంతో కౌంటింగ్ హాలులో దాదాపు బీఆర్ఎస్‌కు చెందిన నేతలే 120మందికి పైగా నేతలు ఏజెంట్లుగా కనిపించనున్నారు. ముఖ్యంగా మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, వివిధ కార్పొరేషన్ల మాజీ చైర్మన్లతో పాటు రాష్ట్రస్థాయి కీలక నేతలను ఏజెంట్లుగా నియమించి పంపిస్తున్నట్లు తెలిసింది. తక్కువ మెజార్టీతో అయినా బీఆర్ఎస్ పార్టీనే గెలువబోతున్నదని, ఇప్పటికే కాంగ్రెస్ అధికార దుర్వినియోగం చేసిందని, కౌంటింగ్ సందర్భంగా తీర్పును కిందామీద చేసే అవకాశం ఉందని అధినేత వారికి సూచించినట్లు సమాచారం. పార్టీ పరంగా అలర్ట్‌గా ఉండాలని సూచించారు.
ఏజెంట్లకు ప్రత్యేక శిక్షణ
జూబ్లీహిల్స్ ఉపఎన్నికల ఓట్ల లెక్కింపును బీఆర్‌ఎస్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది. నియోజకవర్గంలో పోటీ తీవ్రంగా ఉన్న నేపథ్యంలో కౌంటింగ్ ప్రక్రియపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నది. ఓట్ల లెక్కింపు పర్యవేక్షణ కోసం పార్టీ సీనియర్ నేతలు, ప్రముఖులను ఎలక్షన్ ఏజెంట్లుగా, కౌంటింగ్ ఏజెంట్లుగా నియమించింది. వారితో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, పార్టీ సీనియర్ నేత హరీశ్‌రావు తదితర ముఖ్యనేతలు గురువారం తెలంగాణ భవన్‌లో కీలక సమావేశం నిర్వహించారు. ఓట్ల లెక్కింపు సందర్భంగా అనుసరించాల్సిన జాగ్రత్తలపై మార్గనిర్దేశం చేశారు. పోలింగ్ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం, పార్టీ నేతలు అన్నిరకాలుగా అక్రమాలకు పాల్పడ్డారని, వ్యవస్థలను దుర్వినియోగం చేశారని బీఆర్‌ఎస్ నేతలు ఆరోపించారు. ప్రతి కౌంటింగ్ ఏజెంట్ అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు.
Read More..
జూబ్లీహిల్స్‌లో గెలిచేదెవరు..? కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్యే హోరాహోరీ పోరు






