- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కవితపై వేటు.. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే హర్షం
ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha)ను పార్టీ నుంచి సస్పెండ్ చేయడంపై జుక్కల్ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే(Hanmant Shinde) స్పందించారు.

దిశ, వెబ్‌డెస్క్: ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha)ను పార్టీ నుంచి సస్పెండ్ చేయడంపై జుక్కల్ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే(Hanmant Shinde) స్పందించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పార్టీ క్రమశిక్షణ చర్యలను ఉల్లంఘిస్తే సొంత కూతురి పైన కూడా చర్యలు తీసుకోడానికి వెనకాడని కేసీఆర్(KCR) నిర్ణయాలు అభినందనీయం అని కొనియాడారు. ఎమ్మెల్సీ కవితను పార్టీ నుండి సస్పెండ్ చేయడాన్ని స్వాగతిస్తున్నామని పేర్కొన్నారు. కేసీఆర్ నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. కాగా, ఇటీవల కాలంలో కవిత ప్రవర్తిస్తున్న తీరు, కొనసాగిస్తున్న పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు బీఆర్ఎస్‌కు నష్టం కలిగించేలా ఉన్నాయి. అధిష్ఠానం ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తోంది. కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ అధినేత కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు అని కాసేపట్టి క్రితం బీఆర్ఎస్ పార్టీ అధికారిక ప్రకటన చేసింది.
Read More..






