- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హీరోయిన్ల బట్టలు ఉతికిస్తున్నారు.. కోర్టులకు బాంబు బెదిరింపుల వెనుక తమిళనాడుతో లింక్?
తెలుగు రాష్ట్రాల కోర్టులకు బాంబు బెదిరింపులు రావడం వెనుక తమిళనాడు పోలీస్ శాఖలోని వేధింపులకు లింకు ఉందా?

X
దిశ, డైనమిక్ బ్యూరో: తెలుగు రాష్ట్రాల్లోని వివిధ కోర్టులకు ఇవాళ బాంబు బెదిరింపులు కలకలం రేపాయాయి. మధ్యాహ్నం 12:05 గంటలకు మేము అమర్చిన ఆర్డీఎక్స్ పేలుతాయంటూ అగంతకుల నుంచి ఈమెయిల్స్ తీవ్ర ఆందోళన రేపింది. దీంతో రంగంలోకి దిగిన బాంబా స్క్వాడ్ కోర్టుల్లో తనిఖీలు చేపట్టి ఉందంతా ఉత్తదే అని తేల్చారు. అయితే అగంతకుల నుంచి వచ్చిన బెదిరింపు ఈమెయిల్స్ తమిళనాడు పోలీసు సిబ్బంది పేరుతో రావడం సంచలనంగా మారింది.
హీరోయిన్ల బట్టలు ఉతికిస్తున్నారు:
తమిళనాడు కానిస్టేబుళ్లకు తీవ్ర అవమానాలు జరుగుతున్నాయని తమ చేత ఓ హీరోయిన్, డీఎంకే నేతల ఉంపుడు గత్తెల బట్టలు, వారి ఇళ్లలోని మురికి పాత్రలను బలవంతంగా శుభ్రం చేయిస్తున్నారని అగంతకులు ఆరోపించారు. తమిళనాడులో కానిస్టేబుళ్ల కోసం 1979 నైనార్ దాస్ పోలీస్ యూనియన్ సిఫారసులను అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నట్లు ఈ సందేశంలో పేర్కొన్నారు. మా డిమాండ్లు వినిపించడానికి మాకు మరో మార్గం లేదని అందువల్లే బాంబు పేలుళ్లకు పాల్పడుతున్నామని పేర్కొన్నారు. సీ-4 ఆర్డీఎక్స్ తో తయారు చేసిన 3 ఆర్డీఎక్స్ ఐఈడీలు ఇప్పటికే న్యాయమూర్తి/కోర్టు ప్రాంగణంలోని కీలక ప్రాంతాల్లో అమర్చబడ్డాయని మధ్యాహ్నం సమయంలో కోర్టు కార్యాలయం వద్దకు ఒకరిద్దరు సభ్యులు సమీపిస్తారు. క్యూబ్రాంచ్-ఐఎస్ఐ సభ్యులు రిమోట్ కంట్రోల్ ట్రిగ్గర్లు తీసుకుని ప్రాంగణానికి 100 అడుగుల లోపలికి రాగానే ఐఈడీలు వాటంతట అవే పేలిపోతాయన్నారు.
శ్రీలంక ఈస్టర్ తరహా ఆపరేషన్:
ఏదైనా కారణంగా అవి పేలని పక్షంలో మా సభ్యులే భవనంలోకి వచ్చి శ్రీలంక ఈస్టర్ ఆపరేషన్ తరహాలో సిబ్బందితో కలిసి తమను తాము పేల్చుకుంటారని బెదిరించారు. ఏపీ కోర్టు సులభమైన లక్ష్యం అని ఎట్టి పరిస్థితుల్లో మా డిమాండ్లు వినిపిస్తామంటూ మెయిల్ చేశారు. ఆకాశ్ భాస్కరన్ పట్టుబడితే, నివేతా పేతురాజ్ కూడా పట్టుబడుతుంది. కాబట్టి, దానికి ముందు ప్రాంగణాన్ని ఖాళీ చేయాలని పేర్కొన్నారు. అరుణ్ కుమార్, సున్నియా దాస్ ప్రసాద్ మాజీ క్యూబ్రాంచ్ (సీబీ-సీఐడీ II) ఇన్స్పెక్టర్ (86వ బ్యాచ్) నాగపట్టణం పేరుతో ఈ బెదిరింపు మెయిల్ పోలీసులకు చేరింది. అయితే నిజంగానే ఇదితమిళనాడు పోలీసులకు జరుగుతున్న అవమానాల విషయానికి సంబంధించిందేనా లేక ఎవరైనా అగంతకులు ఇలా చేశారా అనేది పోలీసుల విచారణలో తేలనుంది. ఈ ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లేవు, లేఖలో ఉన్న అంశాలను పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు
BREAKING: తెలుగు రాష్ట్రాల్లో కోర్టులకు బాంబు బెదిరింపులు
Next Story






