- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
BREAKING: తెలుగు రాష్ట్రాల్లో కోర్టులకు బాంబు బెదిరింపులు
తెలుగు రాష్ట్రాల్లో కోర్టులకు బాంబు బెదిరింపు మెయిల్స్ రావడం కలకలం రేపింది. ఇస్లామిక్ ప్రార్థనలకు ముందు ఆర్డీఎక్స్ బాంబులు పేలుతాయని మెయిల్ లో పేర్కొన్నారు.

దిశ, వెబ్‌డెస్క్: తెలుగు రాష్ట్రాల్లోని కోర్టులకు బాంబు బెదిరింపులు రావడం కలకలం రేపింది. తెలంగాణలోని నాంపల్లి సీబీఐ, కరీంనగర్ కోర్టులు, అటు ఏపీలో అనంతపురం, రాజమండ్రి సెంట్రల్ నజారత్ జిల్లా కోర్టులో బాంబులు పెట్టామని, మధ్యాహ్నం 12.05 గంటలకు ఇవి బ్లాస్ట్ అవుతాయని మెయిల్స్ రావడంతో పోలీసులు అలర్టయ్యారు. 12 RDX బాంబులను కోర్టుల్లో పెట్టామని, ఇస్లామిక్ ప్రార్థనలకు ముందే అన్ని న్యాయమూర్తులను కోర్టుల నుంచి ఖాళీ చేయించండంటూ మెయిల్ లో పేర్కొన్నారు. దీంతో ఆయా కోర్టుల నుంచి జడ్జిలు, న్యాయవాదులు, పబ్లిక్ ను కోర్టుల ఆవరణల నుంచి బయటకు పంపి, బాంబు స్క్వాడ్స్ తో తనిఖీలు చేపట్టారు. ఇది కేవలం బెదిరింపు మెయిలేనా ? లేక ఏదైనా కేసును తప్పుదోవ పట్టించేందుకు ఇలా మెయిల్ పెట్టారా? అన్నదానిపై విచారణ చేస్తున్నారు. సైబర్ సెల్ అధికారులు ఈ మెయిల్ ఎక్కడి నుంచి, ఎవరు పంపారన్నదానిపై దర్యాప్తు చేపట్టారు.






