- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
BREAKING: ఖానాపూర్ మున్సిపల్ పీఠం బీజేపీ సొంతం
ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ ఎన్నిక ఉత్కంఠకు తెరపడింది. ఆ పీఠాన్ని బీఆర్ఎస్ మద్దతుతో బీజేపీ కైవసం చేసుకుంది.

దిశ, వెబ్‌డెస్క్/ నిర్మల్ / ఖానాపూర్: నిర్మల్ జిల్లాలోని ఖానాపూర్ మున్సిపల్ పీఠం ఎవరికి దక్కుతుందోనన్న ఉత్కంఠకు నేడు తెరపడింది. ఖానాపూర్ మున్సిపాలిటీని బీఆర్ఎస్ మద్దతుతో బీజేపీ కైవసం చేసుకుంది. చైర్ పర్సన్ గా అంకం మౌనిక ఎన్నికయ్యారు. మొత్తం 12 వార్డులుండగా.. బీఆర్ఎస్ 4, బీజేపీ 4, కాంగ్రెస్ 3, ఇండిపెండెంట్ 1 స్థానాల్లో గెలిచాయి. ఎమ్మెల్యే వెడ్మబొజ్జు ఎక్స్ అఫిషియో సభ్యుడిగా ఉండటంతో కాంగ్రెస్ బలం నాలుగుకి చేరింది. అనూహ్యంగా బీఆర్ఎస్..బీజేపీకి మద్దతివ్వడంతో ఖానాపూర్ చైర్మన్ పీఠం ఆ పార్టీ సొంతమైంది.
నిన్నటి వరకూ ఖాన్ పూర్ మున్సిపాలిటీ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక వ్యవహారం తీవ్ర ఉత్కంఠ రేపింది. ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ లేకపోవడంతో.. అటు అధికార కాంగ్రెస్, ఇటు విపక్షాలు చాలా వ్యూహాలే రచించాయి. శనివారమే ఈ మున్సిపల్ చైర్మన్ ఎన్నిక కావాల్సి ఉండగా.. పార్టీల సభ్యుల మధ్య చిన్న వివాదం రేగింది. దీంతో అధికారులు ఎన్నికను నేటికి వాయిదా వేశారు.






