- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హైదరాబాద్-యాదగిరిగుట్ట MMTS మూడో ఫేజ్‌పై బిగ్ అప్‌డేట్.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కీలక ప్రకటన
రాష్ట్ర ప్రజలకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) శుభవార్త చెప్పారు.

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర ప్రజలకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) శుభవార్త చెప్పారు. హైదరాబాద్ (Hyderabad) నుంచి ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట (Yadagirigutta) మధ్య ఎంఎంటీఎస్ (MMTS) మూడో దశ పనులకు త్వరలోనే ప్రధాని నరేంద్ర మోడీ భూమి పూజ చేస్తారని ప్రకటించారు. ఇవాళ హైదరాబాద్‌లోని రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఉచితాల కోసమే బడ్జెట్ అన్నట్లుగా ప్రజల్లో ప్రధాన రాజకీయ పార్టీలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని కిషన్ రెడ్డి మండిపడ్డారు. ఎన్నికల కోసం కాకుండా ‘వికసిత్ భారత్’ కోసం రూపొందించిన బడ్జెట్ ఇది అని వ్యాఖ్యానించారు. ఇప్పటి వరకు పీఎం ఆవాస్ యోజన పథకం కింద తెలంగాణ రాష్ట్రానికి 4.30 లక్షల ఇళ్లు కేటాయించామని పేర్కొన్నారు. అదేవిధంగా జాతీయ రహదారుల నిర్మాణంలో తెలంగాణకు పెద్దపీట వేశామని తెలిపారు. కొమురవెల్లి, జోగులాంబ రైల్వే స్టేషన్లను త్వరలోనే ప్రారంభిస్తామని పేర్కొన్నారు.
రూ.5.50 లక్షల కోట్లతో 3 హై స్పీడ్ రైల్ కారిడార్లు..
కేంద్ర ప్రభుత్వం 5 వందే భారత్, 2 అమృత్ భారత్ రైళ్లను తెలంగాణకు ఇచ్చిందని గుర్తు చేశారు. రూ.5.50 లక్షల కోట్లతో 3 హై స్పీడ్ రైల్ కారిడార్లు (High-Speed Rail Corridors) రాష్ట్రానికి రానున్నాయని తెలిపారు. హైదరాబాద్-యాదగిరిగుట్ట మధ్య ఎంఎంటీఎస్ మూడో దశ పనులకు త్వరలోనే ప్రధాని నరేంద్ర మోడీ భూమి పూజ చేస్తారని పేర్కొన్నారు. ఇక మేడారం జాతరకు కేంద్రం ప్రకటించిన నిధులను రాష్ట్రానికి తీసుకొచ్చే బాధ్యత తనదేనని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.






