టీవీ యాంకర్ స్వేచ్ఛ ఆత్మహత్యలో బిగ్ ట్విస్ట్ !

by velandi.Saikiran |   (  Updated:2025-06-28 04:02:30  IST  )

రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ప్రముఖ న్యూస్ యాంకర్ స్వేచ్ఛ ఆత్మహత్య చేసుకున్నారు. హైదరాబాద్ జవహర్ నగర్ లోని

టీవీ యాంకర్ స్వేచ్ఛ ఆత్మహత్యలో బిగ్ ట్విస్ట్ !
X

దిశ, వెబ్ డెస్క్ : రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ప్రముఖ న్యూస్ యాంకర్ స్వేచ్ఛ ఆత్మహత్య చేసుకున్నారు. హైదరాబాద్ జవహర్ నగర్ లోని తన ఇంట్లో... స్వేచ్ఛ ఆత్మహత్య చేసుకున్నారు. ఇక ఈ సమాచారం తెలియగానే రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేశారు. ఇక ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

దాదాపు 18 సంవత్సరాలుగా పలు టీవీ చానల్స్ లో యాంకర్ గా పని చేశారు స్వేచ్ఛ. మొదట టీవీ9 ఛానల్ లో పనిచేసే బాగా పాపులారీటి సంపాదించారు. అంతేకాదు TUWJ సెక్రటరీగా పనిచేసిన అనుభవం స్వేచ్ఛకు ఉంది. అయితే తాజాగా చనిపోయిన యాంకర్ స్వేచ్ఛ ఆత్మహత్య సంఘటనలో బిగ్ ట్విస్ట్ నెలకొంది. స్వేచ్ఛకు ఇప్పటికే పెళ్లై 13 సంవత్సరాల కూతురు కూడా ఉందని తెలుస్తోంది.

కొన్ని కారణాల వల్ల మొదటి భర్తకు విడాకులు ఇచ్చిందట స్వేచ్ఛ. ఆ తర్వాత టీ న్యూస్ మాజీ ఉద్యోగి పూర్ణచందర్ అనే వ్యక్తితో కలిసి ఉంటుందని సమాచారం అందుతుంది. కానీ కొన్ని రోజులుగా వీళ్ళిద్దరి మధ్య కూడా గొడవలు ప్రారంభమయ్యాయట. ఈ నేపథ్యంలోనే స్వేచ్ఛ ఈ దారుణమైన నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. దీనిపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read More..

Hyderabad : ప్రముఖ టీవీ యాంకర్ సూసైడ్

Next Story