ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్.. మాజీ సీఎం KCRకు నోటీసులు!

by Kema Shiva Kumar |   (  Updated:2025-12-23 11:17:32  IST  )

Phone Tapping Case, Former CM KCR, Harish Rao, SIT, Notices, Prabhakar Rao, Sajjanar, Praneeth Rao, FSL Data

ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్.. మాజీ సీఎం KCRకు నోటీసులు!
X

దిశ, వెబ్‌డెస్క్: ఫోన్ ట్యాపింగ్ కేసు (Phone Tapping Case)లో సంచలన పరిణామాలు చోటుచేసుకోబోతున్నాయా అంటే ఔననే సంకేతాలు వెలువడుతున్నాయి. ఈ కేసులో తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తొమ్మిది మంది పోలీసు ఉన్నతాధికారులతో హైదరాబాద్ కమిషనర్ వీసీ సజ్జనార్ (VC Sajjanar) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సిట్ విచారణను జెట్ స్పీడ్‌తో ప్రారంభించింది. ఇందులో భాగంగా ప్రధాన నిందితుడు మాజీ ఎస్‌బీఐ చీఫ్ ప్రభాకర్ రావు (Prabhakar Rao) ఇచ్చిన స్టేట్‌మెంట్, ఎఫ్‌ఎస్‌ఎల్ ఇచ్చిన డేటా ఆధారంగా కొత్తగా ఏర్పాటైన సిట్ తొలిసారి రాజకీయ అగ్రనేతలకు నోటీసులు ఇవ్వబోతున్నట్లుగా తెలుస్తోంది.

పదేపదే మహేందర్‌ రెడ్డి, అనిల్ కుమార్ పేర్ల ప్రస్తావన..

ఇక ఫోన్ ట్యాపింగ్ ఎవరి కోసం చేశారు.. ఎవరి ఆదేశాల మేరకు చేశారన్న దారిపై సిట్ ప్రధానంగా ఫోకస్ పెట్టింది. ఈ నేపథ్యంలోనే మాజీ సీఎం కేసీఆర్ (KCR)తో పాటు మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao)కు నోటీసులు ఇచ్చి విచారణకు పిలవాలని యోచిస్తున్నట్లుగా సమాచారం. అయితే, ఎంక్వైరీలో ప్రభాకర్ రావు పదేపదే అప్పటి డీజీపీ మహేందర్ రెడ్డి (Mahender Reddy)తో పాటు అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ అనిల్ కుమార్ పేర్లను ప్రస్తావనకు తెస్తున్నట్లుగా సిట్ చీఫ్ సజ్జనార్ గుర్తించారు. ఇప్పటికే ఈ కేసులో మహేందర్ రెడ్డి స్టేట్‌మెంట్‌ను అధికారులు రికార్డు చేసిన విషయం తెలిసిందే. దీంతో అసెంబ్లీ సమావేశాల అనంతరం ఫోన్ ట్యాపింగ్ కేసులో ఊహించని పరిణామాలు చోటుచేసుకునే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.

ఎఫ్ఎస్ఎల్ ఇచ్చిన రిపోర్టు ఆధారంగా..

అదేవిధంగా ఫోన్ ట్యాపింగ్ రివ్యూ కమిటీ (Phone Tapping Review Committee)లో సభ్యులైన మాజీ సీఎస్‌లు సోమేష్ కుమార్, శాంతికుమారి, ఇతర అధికారులు తిరుపతి, శేషాద్రిలను సిట్ విచారించిన విషయం తెలిసిందే. అయితే, తమ దగ్గరికి ప్రభాకర్ రావు కొన్ని వేల నెంబర్లు తీసుకొచ్చారని పేర్కొన్నారు. ఎస్‌బీఐ మీద ఉన్న నమ్మకంతో సంఘ విద్రోహులు, మావోయిస్టులు, టెర్రరిస్టులపై ఫోకస్ పెడతారని ఆ నెంబర్లను తాము వెరిఫై చేయలేకపోయామని సమాధానమిచ్చారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎఫ్‌ఎస్‌ఎల్ (FSL) ఓ ప్రముఖ న్యూస్ ఛానల్ ఎండీ శ్రవణ్ రావు (Sravan Rao), మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు (Praneeth Rao)కు మధ్య సంభాషణలను రీట్రీవ్ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆ డేటాను ఆధారంగా చేసుకుని సిట్ మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావులకు నోటీసులు ఇస్తారనే ముచ్చట పొలిటికల్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

READ MORE ....

కేసీఆర్ వి అన్నీ జూటాకోర్ మాటలు : ఎంపీ డీకే అరుణ

Next Story