కేసీఆర్ వి అన్నీ జూటాకోర్ మాటలు : ఎంపీ డీకే అరుణ

by Ajay Maddhiboyina |   (  Updated:2025-12-23 11:15:53  IST  )

కేసీఆర్ వి అన్నీ జూటాకోర్ మాట‌లేన‌ని ఎంపీ డీకే అరుణ మండిప‌డ్డారు. గ‌తంలో ప‌దేళ్లు అధికారంలో ఉండి మూడేళ్ల‌లో పాల‌మూరు రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేస్తాన‌ని చెప్పాడ‌న్నారు.

కేసీఆర్ వి అన్నీ జూటాకోర్ మాటలు : ఎంపీ డీకే అరుణ
X

దిశ‌, వెబ్ డెస్క్: కేసీఆర్ వి అన్నీ జూటాకోర్ మాట‌లేన‌ని ఎంపీ డీకే అరుణ మండిప‌డ్డారు. గ‌తంలో ప‌దేళ్లు అధికారంలో ఉండి మూడేళ్ల‌లో పాల‌మూరు రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేస్తాన‌ని చెప్పాడ‌న్నారు. మూడేళ్లు కాదు ప‌దేళ్లు అధికారంలో ఉన్న కేసీఆర్ ప్రాజెక్టును ఎందుకు పూర్తి చేయ‌లేద‌ని ప్ర‌శ్నించారు. దోపిడీ కోస‌మే పాల‌మూరు- రంగారెడ్డి ప్రాజెక్టును చేప‌ట్టార‌ని విమ‌ర్శించారు. పాల‌మూరు రంగారెడ్డి డిజైన్ మార్చాడ‌ని, ప్రాజెక్టు అంచ‌నాలు అడ్డ‌గోలుగా పెంచార‌ని అన్నారు.

కేసీఆర్ కు నిజంగా చిత్త‌శుద్ధి ఉంటే డిజైన్ మార్చేవాడే కాద‌న్నారు. పాల‌మూరు రంగారెడ్డిలో జ‌ర‌గాల్సిన దోపిడీ జ‌రిగిపోయింద‌ని కానీ ప్రాజెక్టు మాత్రం పూర్తి కాలేద‌న్నారు. ప్రాజెక్టును రాష్ట్ర ప్ర‌భుత్వం చేప‌ట్టింద‌ని ఆ ప్రాజెక్టుకు కేంద్రం ఎందుకు నిధులు ఇస్తుంద‌ని అన్నారు. కేంద్రానికి పాల‌మూరుకు సంబంధం ఏంటి అని ప్ర‌శ్నించారు. జాతీయహోదా క‌ల్పించాల‌ని కూడా అడ‌గ‌లేద‌ని అన్నారు. పోలవరానికి వ‌చ్చి పాల‌మూరుకు జాతీయ‌హోదా రాక‌పోవ‌డానికి కార‌ణం అప్పుడు అధికారంలో ఉన్న కేసీఆర్, యూపీఏ ప్ర‌భుత్యాల‌నే అని అన్నారు.

READ MORE ....

ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్.. మాజీ సీఎం KCRకు నోటీసులు!

Next Story