- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో బిగ్ డే.. జూబ్లీహిల్స్ పీఎస్‌లో ఆ ఐదుగురు
ఫోన్ ట్యాపింగ్ కేసులో (Phone Tapping Case) ప్రధాన నిందితుడు, మాజీ ఎస్‌ఐబీ చీఫ్ ప్రభాకర్ రావు (Prabhakar Rao) కస్టోడియల్ విచారణ నేటితో ముగియనుంది.

దిశ, వెబ్‌డెస్క్: ఫోన్ ట్యాపింగ్ కేసులో (Phone Tapping Case) ప్రధాన నిందితుడు, మాజీ ఎస్‌ఐబీ చీఫ్ ప్రభాకర్ రావు (Prabhakar Rao) కస్టోడియల్ విచారణ నేటితో ముగియనుంది. దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు (Supreme Court) ఆదేశాల మేరకు డిసెంబర్ 19న ఆయన కస్టడీని ఇవాళ్టి వరకు పొడిగించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు డిసెంబర్ 12న జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయిన ప్రభాకర్ రావును హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ నేతృత్వంలోని 9 మంది స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (SIT) లోతుగా విచారిస్తోంది. అయితే, నేడు విచారణ చివరి రోజు కావడంతో కేసులో నిందితులైన ప్రణీత్ రావు, భుజంగ రావు, రాధాకిషన్ రావు, తిరుపతన్నలను సిట్ జూబ్లీహిల్స్ పీఎస్‌కు పిలిపించింది. దీంతో ఒకేసారి అందరికీ ప్రశ్నలు సంధిస్తూ సమాధానాలు రాబడుతున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా మాజీ ఎస్‌ఐబీ చీఫ్ ప్రభాకర్ రావు మెజారిటీ ప్రశ్నలకు “నో” అనే సమాధానం ఇచ్చారని సమాచారం.
ఇక ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావును ఏ ప్రశ్న అడిగినా.. మాజీ డీజీపీ, ఇంటెలిజెన్స్ చీఫ్‌లు నవీన్ చంద్, అనిల్ కుమార్ పేర్లను మాత్రమే ప్రస్తావిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇక ఫోన్ ట్యాపింగ్ చేసిన 6 వేల ఫోన్ నంబర్లు ఉన్న పెన్‌డ్రైవ్‌పై ప్రభాకర్ రావు నోరు మెదపనట్లుగా తెలుస్తోంది. ఎవరి ఆదేశాల మేరకు ఫోన్ ట్యాపింగ్ చేశారు, రాజకీయ నేతల పాత్రపై ఆరా తీయగా ప్రభాకర్ రావు మాజీ మంత్రి హరీశ్ రావు పేరును ప్రస్తావించినట్లుగా సమాచారం. మావోయిస్టుల నుంచి ఆయనకు ప్రమాదం పొంచి ఉందని, ఆ విషయంపైనే ఫోన్ ట్యాపింగ్ విషయంలో హరీశ్ రావుతో చర్చించినట్లుగా విచారణలో ప్రభాకర్ రావు చెప్పారనే విషయం బయటకు పొక్కింది. కస్టోడియల్ విచారణ చివరి రోజు కావడంతో సిట్ అధికారులు డాక్యుమెంటేషన్ పనుల్లో నిమగ్నమయ్యారు.
Read More..
నేటితో ప్రభాకర్ రావు కస్టోడియల్ విచారణ క్లోజ్.. సాలిడ్ ఎవిడెన్స్ సంపాదించిన సిట్






