- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ బ్లాస్ట్.. సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది.

దిశ, వెబ్‌డెస్క్: ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడు కొండల్ రెడ్డికి సీపీ సజ్జనార్ సిట్ నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు రేపు ఉదయం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న సిట్ కార్యాలయానికి విచారణకు హాజరు కావాలని ఆ నోటీసులలో స్పష్టంగా పేర్కొన్నారు. అయితే, 2024కు ముందు రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్‌గా ఉన్న సమయంలో ఆయన సోదరుడు కొండల్ రెడ్డి ఫోన్ కూడా ట్యాప్ అయినట్లుగా సిట్ అధికారులు విచారణలో గుర్తించారు. ఈ మేరకు ఆయనను విచారించి స్టేట్‌మెంట్‌ను రికార్డు చేయనున్నారు.
కాగా, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అక్రమంగా ఫోన్లు ట్యాప్ చేసి రాజకీయ లబ్ధికి వాడుకున్నారనే అభియోగాలపై రేవంత్ సర్కార్ ఇటీవల ఏర్పాటు సీపీ సజ్జనార్ నేతృత్వంలోని సిట్ తన దూకుడును పెంచింది. ఎస్ఐబీ (SIB) మాజీ అధికారులు ఇచ్చిన వాంగ్మూలాలు, ఫోరెన్సిక్ ల్యాబ్ (FSL) నివేదికల ఆధారంగా కీలక రాజకీయ నేతలకు నోటీసులు జారీ చేస్తున్నారు. కొండల్ రెడ్డితో పాటు ఇవాళ నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్‌లకు సిట్ నోటీసులు జారీ చేసి విచారణకు పిలిచింది. మునుగోడు ఉప ఎన్నికల సమయంలో 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో నిందితులతో వీరు జరిపిన సంభాషణలపై ప్రస్తుతం సిట్ అధికారులు ఆరా తీస్తున్నారు. కేవలం రాజకీయ నాయకులే కాకుండా వారి కుటుంబ సభ్యులు, సన్నిహితులను కూడా ప్రశ్నిస్తున్నారు.






