BC bandh: బీసీ బంద్ ఎఫెక్ట్.. ప్రయాణికుల వద్ద ప్రైవేట్ వాహనదారుల దోపిడీ

by Prasad Jukanti |   (  Updated:2025-10-18 05:23:37  IST  )

బంద్ కారణంగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

BC bandh: బీసీ బంద్ ఎఫెక్ట్.. ప్రయాణికుల వద్ద ప్రైవేట్ వాహనదారుల దోపిడీ
X

దిశ, డైనమిక్ బ్యూరో: రిజర్వేషన్లలో తమ వాటా కోసం బీసీ జేఏసీ తలపెట్టిన బంద్ (BC JAC Bandh) రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతోంది. ఇవాళ తెల్లవారు జామునుంచే అన్ని జిల్లా కేంద్రాల్లోని ఆర్టీసీ డిపోల ముందు బీసీ సంఘాలు ఆందోళనకు దిగాయి. డిపోల నుంచి బస్సులు (RTC buses) బయటకు రాకుండా ఎక్కడికక్కడ నేతలు అడ్డుకున్నారు. బంద్ కారణంగా రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో బస్సు చక్రం కదలలేదు. అన్ని బస్సులు డిపోలకే పరిమితం అయ్యాయి. దీంతో ప్రయాణికులు, ఉద్యోగస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇదే అదునుగా ప్రైవేట్ క్యాబ్ డ్రైవర్లు (Private cabs), ఆటో డ్రైవర్లు ప్రయాణికులను నిలువునా దోపిడీ చేస్తున్నారు. అధిక డబ్బులు వసూలు చేస్తున్నారు. ఎమర్జెన్సీ సేవల్లో పని చేసే సిబ్బంది తమ సిబ్బంది ఉద్యోగాలకు వెళ్లేందుకు క్యాబ్‍లను ఆశ్రయించగా వారు చెప్పే ధరలను చూసి బెంబేలెత్తుతున్నారు. ఉప్పల్ రింగ్ రోడ్డు వద్ద ప్రైవేట్ క్యాబ్ డ్రైవర్ల దందా ప్రయాణికులను షాక్ కు గురి చేస్తోంది. ఉప్పల్ నుంచి హన్మకొండకు ప్రయాణికుల నుంచి డబుల్ చార్జీలు వసూలు చేస్తున్నారు. సాధారణ రోజుల్లో రూ. 300 తీసుకునే క్యాబ్ డ్రైవర్లు ఇవాళ బంద్ కారణంగా రూ.700 వసూలు చేస్తున్నారు. ఇక నగరంలో ఇన్నాళ్లు ఆర్టీసీ ఉచిత ప్రయాణం పథకం వల్ల ఇన్నాళ్లు బోసీ బోయిన ఆటోలు ప్రయాణికుల రద్దీతో ఫుల్ డిమాండ్ పెరిగింది. ఇక ఇవాళ బంద్ రేపు ఆదివారం, ఎల్లుండి దిపావళి కావడంతో వరుస సెలవులు ఉన్నాయని సొంత ఊర్లకు వెళ్లాలనుకునే వారికి ప్రైవేట్ వాహనాల ధరలు పట్టపగలే చుక్కలు చూపిస్తున్నాయి.

Read More..

కొనసాగుతోన్న బీసీ సంఘాల బంద్.. జిల్లాల్లో డిపోలకే పరిమితమైన బస్సులు

Next Story