'అసలు ఎవర్రా నువ్వు.. ప్రతీ దాంట్లో వేలు పెడతావ్'.. ప్రకాష్ రాజ్‌కు బండ్లన్న స్ట్రాంగ్ కౌంటర్

by Naga Rani Yarlagadda |   (  Updated:2026-06-04 06:11:28  IST  )

పవన్ కల్యాణ్ పై ప్రకాష్ చేసిన వ్యాఖ్యలపై నిర్మాత బండ్ల గణేష్ స్ట్రాంగ్ కౌంటరిచ్చారు. ముందు నువ్వు ఏ ప్రాంతంవాడివో చూస్కోవాలని సూచించారు.

అసలు ఎవర్రా నువ్వు.. ప్రతీ దాంట్లో వేలు పెడతావ్.. ప్రకాష్ రాజ్‌కు బండ్లన్న స్ట్రాంగ్ కౌంటర్
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో జనసేన పోటీ చేస్తుందని ఆ పార్టీ అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై.. నటుడు ప్రకాష్ రాజ్ సెటైర్లు వేశారు. ప్రకాష్ రాజ్ వేసిన సెటైర్లపై నిర్మాత బండ్ల గణేష్ స్ట్రాంగ్ కౌంటరిచ్చారు. నీకెందుకురా ప్రతీ దాంట్లో వేలుపెడతావ్ అంటూ ఎక్స్ లో చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది.

"నీకెందుకురా ప్రతి దాంట్లో వేలుపెట్టడం? అసలు నువ్వెవడివి? తమిళోడివా, తెలుగోడివా, కన్నడోడివా? నీ ఊరు ఏది, నీ కథ ఏంటి? ప్రతి ఊర్లో, ప్రతి ఇష్యూలో దూరి జడ్జిమెంట్‌లు ఇవ్వడానికి నువ్వేమైనా కలెక్టర్‌వా లేక దేశ ప్రధాని వా? ఎక్కడ చూసినా నువ్వే, ఏ విషయం వచ్చినా నువ్వే. నీ బతుక్కి పని లేకపోతే చూసుకో, కానీ అందరి విషయాల్లో దూరి హీరోలా ఫీలవ్వకు. ముందు నీ అడ్రస్ నువ్వు తెలుసుకో, తర్వాత ప్రపంచాన్ని మార్చే ప్రయత్నం చేయ్!” అంటూ ప్రకాష్ చేసిన ట్వీట్ కు రిప్లైగా పోస్టు పెట్టారు.

దీనిపై ఓ మీడియా ఛానల్ తో మాట్లాడుతూ.. ప్రకాష్ రాజుకు ప్రతీదానిలో దూరడం అలవాటైపోయిందని, అన్ని రాష్ట్రాల్లోనూ వేలుపెట్టడం మానుకోవాలని సూచించారు. ఆయన ఎన్నికల్లో పోటీ చేస్తే కేవలం 1200 ఓట్లే వచ్చాయన్న విషయం గుర్తుంచుకోవాలన్నారు. తనకు 30 సంవత్సరాలుగా ప్రకాష్ రాజ్ తెలుసని, అయినప్పటికీ పవన్ పై ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే ఊరుకోబోనన్నారు. ప్రకాష్ రాజ్ తన స్థాయి ఏంటో తెలుసుకోవాలని, ఆయన చేసిన వ్యాఖ్యలు 100 శాతం తప్పన్నారు. ఒక ప్లేస్, ఒక ఊరును ఎంచుకుని వాటిని చూసుకోవాలని, ఆ తర్వాతే మిగతా ప్రాంతాల్లోకి రావాలని హితవు పలికారు. ప్రతీ విషయంలో ఆయన ఇన్వాల్వ్ అవుతున్నారనే "రా" అనే పదాన్ని వాడానని, ఆయన్ని కించపరచాలని ఆ పదం వాడలేదని స్పష్టం చేశారు. సినిమాలకు, రాజకీయాలకు సంబంధం లేదని, ఆయనతో కలిసి సినిమా చేయాల్సి వస్తే కచ్చితంగా చేస్తానని, కానీ తప్పు ఉంటే సరిచేసుకోమని చెప్తానన్నారు.

పొత్తుతో వస్తున్నారా? సింగల్‌గా వస్తున్నారా? పవన్‌పై ప్రకాష్ రాజ్ సెటైర్లు

Next Story