- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పొత్తుతో వస్తున్నారా? సింగల్‌గా వస్తున్నారా? పవన్‌పై ప్రకాష్ రాజ్ సెటైర్లు
జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలంగాణ రాజకీయాల్లోకి వస్తానని, స్వయంగా తానే తిరుగుతానని ప్రకటించిన సంగతి తెలిసిందే. రాబోయే ఎన్నికల్లో జనసేన పోటీ చేస్తుందని పవన్ ప్రకటించారు. అయితే పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై ఇన్ డైరెక్ట్‌గా నటుడు ప్రకాష్ రాజ్ కౌంటర్ ఇచ్చారు.

దిశ, వెబ్ డెస్క్: జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలంగాణ రాజకీయాల్లోకి వస్తానని, స్వయంగా తానే తిరుగుతానని ప్రకటించిన సంగతి తెలిసిందే. రాబోయే ఎన్నికల్లో జనసేన పోటీ చేస్తుందని పవన్ ప్రకటించారు. అయితే పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై ఇన్ డైరెక్ట్‌గా నటుడు ప్రకాష్ రాజ్ కౌంటర్ ఇచ్చారు. మీరొస్తానంటే మేమొద్దంటామా.. రండి దొర.. కానీ వచ్చే ముందు ఉత్తుత్తినే వస్తున్నారా.. పొత్తుతో వస్తున్నారా..? లేదా సింగిల్ గా వస్తున్నారా.. అనేది చెప్పి రండి. అంటూ ట్వీట్ చేశారు. అంతే కాకుండా జస్ట్ ఆస్కింగ్... అంటూ హాష్ ట్యాగ్ ఇచ్చారు. అయితే ప్రకాష్ రాజ్ తన ట్వీట్‌లో ఎక్కడా పవన్ కల్యాణ్ పేరును ప్రస్తావించలేదు.
కానీ ప్రస్తుతం పవన్ కల్యాణ్ తెలంగాణ రాజకీయాల్లోకి వస్తానంటూ మీడియా సమావేశంలో చెప్పిన తరవాత ప్రకాష్ రాజ్ చేసిన ట్వీట్ ఆయన గురించే అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. దీంతో కొంతమంది పవన్ వస్తే టీడీపీ, బీజేపీ పొత్తుతోనే వస్తాడని కొంతమంది కామెంట్ చేస్తుంటే మరికొందరు ఎలా వస్తే నీకెందుకు అని కామెంట్ చేస్తున్నారు. ముందు బెంగుళూరులో డిపాజిట్ దక్కించుకో అంటూ పవన్ అభిమానులు ప్రకాష్ రాజ్‌కు కౌంటర్లు ఇస్తున్నారు. మరికొందరు మా ఎన్నికల్లోనే ఓడిపోయిన నువ్వు చెబుతున్నావా ప్రకాష్ రాజ్ అంటూ సెటైర్లు వస్తున్నారు.






