- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చీకటి ఒప్పందం.. మజ్లిస్‌ను గెలిపించేందుకు పోటీకి కాంగ్రెస్, బీఆర్ఎస్ దూరం: బండి సంజయ్
తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు కుమ్మక్కు రాజకీయాలకు పాల్పడుతున్నాయంటూ భారతీయ జనతా పార్టీ చేస్తున్న ఆరోపణలు నిజమేనని తేలిపోయిందని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు.

దిశ, డైమనిక్ బ్యూరో: తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు కుమ్మక్కు రాజకీయాలకు పాల్పడుతున్నాయంటూ భారతీయ జనతా పార్టీ చేస్తున్న ఆరోపణలు నిజమేనని తేలిపోయిందని కేంద్ర మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) ఆరోపించారు. ఆ రెండు పార్టీల మధ్య ఫెవికాల్ బంధం కొనసాగుతోందన్నారు. డీలిమిటేషన్ పేరుతో మొన్న (Congress) కాంగ్రెస్, బీఆర్ఎస్ (BRS) ఒక్కటైనయని, త్వరలో తెలంగాణలో కలిసే బహిరంగ సభను నిర్వహించబోతున్నాయని అన్నారు. ఈ బహిరంగ సభ ఏర్పాట్లు రెండు పార్టీలు కలిసే పనిచేస్తున్నయని, ఎవరిని పిలవాలో కలిసే డిసైడ్ చేస్తున్నాయన్నారు. అట్లాగే నిన్న పార్లమెంట్ లో వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుపై నిర్వహించిన ఓటింగ్ సందర్బంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటై కేంద్రంలోని నరేంద్రమోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేశాయని చెప్పారు.
ఈ రోజు జీహెచ్‌ఎంసీ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్‌కు చివరి రోజు అని, అయినప్పటికీ కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు తమ అభ్యర్థులను నిలబెట్టకుండా మజ్లీస్ అభ్యర్ధికి మద్దతుగా నిలిచాయని ఆరోపించారు. ఎన్నికలకు ముందు కాళేశ్వరం ప్రాజెక్టులో కేసీఆర్ కుటుంబం రూ.లక్ష కోట్లు అవినీతికి పాల్పడ్డారని ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిసహా కాంగ్రెస్ నాయకులంతా కోడైకూశారని, విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందం, ధరణి పోర్టల్ లో వేల కోట్ల అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారని గుర్తుకు చేశారు. ఫార్ములా ఈ రేసులో కేటీఆర్ అవినీతి చేశారని పదేపదే ప్రచారం చేశారని, అధికారంలోకి రాగానే కేసీఆర్ కుటుంబాన్ని జైలుకు పంపుతామని కాంగ్రెస్ నేతలు.. తీరా గెలిచాక డబ్బు సంచులకు అమ్ముడుపోయి బీఆర్ఎస్ తో కుమ్కకై అవినీతి కేసులన్నీ నీరుగారుస్తున్నారని ఆరోపింపచారు.
కాంగ్రెస్, బీఆర్ఎస్ కుమ్మక్కు రాజకీయాలకు ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి? అని ప్రశ్నించారు. ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించడంవల్ల గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీసీలు పోటీ చేయాల్సిన 30 చోట్ల మజ్లిస్ పోటీ చేసి గెలిచిందని, ఇప్పుడు బీసీ జాబితా ముసుగులో ముస్లింలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించడంవల్ల విద్య, ఉద్యోగాల్లో బీసీలకు తీరని అన్యాయం జరగబోతోందని అన్నారు. ఈ రెండు పార్టీలు కలిసి హైదరాబాద్‌ను మజ్లిస్ పార్టీ చేతుల్లో పెట్టడానికి సిద్దమయ్యాయని, కాంగ్రెస్, బీఆర్ఎస్ చీకటి ఒప్పందాలు, కుమ్కక్కు రాజకీయాలపై తెలంగాణ సమాజం ఆలోచించాలని బండి సంజయ్ కోరారు.
Also Read: MLC Elections: కాంగ్రెస్, బీఆర్ఎస్ దూరం.. హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ వర్సెస్ ఎంఐఎం






