MLC Elections: కాంగ్రెస్, బీఆర్ఎస్ దూరం.. హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ వర్సెస్ ఎంఐఎం

by Prasad Jukanti |   (  Updated:2025-04-04 10:59:32  IST  )

హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నిక బీజేపీ వర్సెస్ ఎంఐఎం మధ్య రసవత్తరంగా మారింది.

MLC Elections: కాంగ్రెస్, బీఆర్ఎస్ దూరం.. హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో  బీజేపీ వర్సెస్ ఎంఐఎం
X

దిశ, డైనమిక్ బ్యూరో : హైదరాబాద్ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నిక (Hyderabad MLC Election) రసవత్తరంగా మారింది. రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తిని రేపుతున్న ఈ ఎన్నికకు సంబంధించిన నామినేషన్ ప్రక్రియ ఇవాళ్టితో ముగిసింది. బీజేపీ(BJP), ఎంఐఎం(MIM) ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించగా పోటీకి దూరంగా ఉండాలని కాంగ్రెస్(Congress), బీఆర్ఎస్(BRS) నిర్ణయం తీసుకున్నాయి. బీజేపీ తరఫున ఎన్.గౌతమ్‌రావు, ఎంఐఎం తరఫున మీర్జా రియాజ్ ఉల్ అసన్‌ ఎఫెండ్‌ నామినేషన్ దాఖలు చేశారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పోటీలో లేకపోవడంతో రాజకీయంగా నిప్పు, ఉప్పులా ఉండే బీజేపీ, ఎంఐఎం మధ్యే అసలైన పోటీ సాగనుంది. వీరితోపాటు మరో ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు. ఈనెల 9వ తేదీ వరకు నామినేషన్ల విత్ డ్రాకు అవకాశం ఉండగా ఈనెల 23వ తేదీన పోలింగ్ 25వ తేదీన కౌంటింగ్ జరగనున్నది. మొత్తం 110 మంది ఓటర్లు ఉండగా ఎంఐఎంకు 49, బీఆర్ఎస్‌కు 25, బీజేపీకి 22, కాంగ్రెస్‌కు 14 ఓట్లు ఉన్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ బరిలోగి దిగడం వెనుక మతలబు ఏంటి? అనేది ఉత్కంఠగా మారింది.

Also Read: చీకటి ఒప్పందం.. మజ్లిస్‌ను గెలిపించేందుకు పోటీకి కాంగ్రెస్, బీఆర్ఎస్ దూరం: బండి సంజయ్

Next Story