తప్పు చేస్తే శిక్ష అనుభవించాల్సిందే.. భగీరథ్ కేసుపై బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

by Ajay Maddhiboyina |   (  Updated:2026-05-12 14:53:06  IST  )

త‌న కుమారుడు బండి భ‌గీర‌థ్ పై న‌మోదైన పోక్సో కేసుపై కేంద్రమంత్రి బండి సంజ‌య్ స్పందించారు. క‌న్న‌పేగు డిప్రెష‌న్‌లో ఉందని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. త‌న కుమారుడిని క్రిమిన‌ల్‌లా చూపే ప్ర‌య‌త్నం చేస్తున్నారంటూ ఎమోష‌న‌ల్ అయ్యారు.

తప్పు చేస్తే శిక్ష అనుభవించాల్సిందే.. భగీరథ్ కేసుపై బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు
X

దిశ‌, వెబ్ డెస్క్: త‌న కుమారుడు బండి భ‌గీర‌థ్ పై న‌మోదైన పోక్సో కేసుపై కేంద్రమంత్రి బండి సంజ‌య్ స్పందించారు. తాను ఏ దారిలో వెళుతున్నానో అదే దారిలో తన భార్య కూడా వస్తోందన్నారు. తన దగ్గర కంటే తన భార్య దగ్గరకే కార్యకర్తలు ఎక్కువగా వెళ్తారని చెప్పారు. ఈరోజు తన భార్య డిప్రేషన్ లోకి వెళ్లిందని.. తల్లడిల్లిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. తన కుమారుడు ఏ తప్పు చేయలేదని చెప్పాడన్నారు. కానీ త‌న కుమారుడిని క్రిమిన‌ల్‌లా చూపే ప్ర‌య‌త్నం చేస్తున్నారంటూ ఎమోష‌న‌ల్ అయ్యారు. త‌ప్పు చేస్తే ఎవ‌రైనా శిక్ష అనుభ‌వించాల్సిందేన‌ని అన్నారు. త‌ప్పు ఎవ‌రు చేసినా స‌మ‌ర్దించేదిలేద‌ని చ‌ట్టం ముందు అంద‌రూ స‌మానులేన‌ని స్ప‌ష్టం చేశారు. త‌న కుటుంబంపై ప్ర‌త్య‌క్షంగా, ప‌రోక్షంగా దాడి చేస్తున్నార‌ని ఆవేద‌న వ్యక్తం చేశారు. నన్ను కెలికారు.. నా కుటుంబాన్ని ఇబ్బంది పెట్టినవాళ్లను వదిలిపెట్టేది లేదని సంజయ్ హెచ్చరించారు.

మీరు పెట్టిన నిప్పు మీకే అంటుకుంటుందని వార్నింగ్ ఇచ్చారు. సమాజమే తన కుటుంబం అని భావించానని తన కుటుంబంపై రాళ్లు వేస్తున్నారని అన్నారు. తప్పు చేస్తే ఎవరి కుమారుడైనా వదిలిపెట్టనని అన్నారు. కుట్రలు, కుతంత్రాలతో తన కుటుంబాన్ని బజారున పడేశారని, వారిని విడిచిపెట్టనని హెచ్చరించారు. ఆంజనేయ స్వామి లంకా దహనం చేసినట్లు మీరు పెట్టిన ఈ నిప్పుతో దళారుల వ్యవస్థ, కుటుంబ వ్యవస్థ, అవినీతి వ్యవస్థను దగ్ధం చేస్తానని అన్నారు. శ్రీరామచంద్రుడికే అరణ్యవాసం తప్పలేదని వ్యాఖ్యానించారు. తన గుండె మీద కాషాయం జెండా ఉందని, తన తల మీద అమ్మవారి ఆశీస్సులు ఉన్నాయని చెప్పారు.

బండి సంజయ్ కుమారుడు భగీరథ్‌కు సిట్ నోటీసులు

Next Story