BREAKING: బండి సంజయ్ కుమారుడు భగీరథ్‌కు సిట్ నోటీసులు

by Ajay Maddhiboyina |   (  Updated:2026-05-12 14:14:23  IST  )

బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‌కు సిట్ నోటీసులు జారీ చేసింది. ఇటీవల భగీరథ్ పై నమోదైన పోక్సో కేసు విచారణ కోసం ఈ నోటీసులు జారీ చేసింది.

BREAKING: బండి సంజయ్ కుమారుడు భగీరథ్‌కు సిట్ నోటీసులు
X

దిశ, వెబ్ డెస్క్: బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‌కు సిట్ నోటీసులు జారీ చేసింది. ఇటీవల భగీరథ్ పై నమోదైన పోక్సో కేసు విచారణ కోసం ఈ నోటీసులు జారీ చేసింది. రేపు మధ్యాహ్నం 2గంటలకు పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో విచారణకు హాజరవ్వాలని ఆదేశించింది. ఇదిలా ఉంటే ఓ మైనర్ బాలికపై లైంగిక దాడి చేశాడనే ఆరోపణలతో భగీరథ్ పై బాధితురాలి తల్లి కేసు నమోదు చేసింది. మరోవైపు తనను ట్రాప్ చేశారని ఆరోపిస్తూ భగీరథ్ కరీంనగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు.

కేంద్ర మంత్రి కుమారుడు కావడంతో ఈ కేసును సీరియస్ గా తీసుకున్న ప్రభుత్వం విచారణ పారదర్శకంగా జరగాలంటూ డీజీపీకి ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో సిట్ ద్వారా కేసును విచారిస్తున్నారు. సాధారణంగా పోక్సో కేసు నమోదైన 24 గంటల్లో నింధితులను అదుపులోకి తీసుకోవాలి. కానీ ఇప్పటి వరకు అరెస్ట్ చేయకపోవడంతో విమర్శలు వస్తున్నాయి. దీంతో భగీరథ్ పట్టుబడలేదని దొరికితే కచ్చితంగా అదుపులోకి తీసుకుంటామని పోలీసులు చెబుతున్నారు. ఇది ఇలా ఉండగానే ఈ కేసులో తనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలంటూ భగీరథ్ ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించారు. దీంతో ఎప్పుడు ఏం జరుగుతుందా అన్న ఆసక్తి నెలకొంది.

Next Story