- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మీలా డ్రగ్స్ తీసుకోవడం నాకు తెలియదు: కేటీఆర్‌కు బండి సంజయ్ కౌంటర్
బీఆర్ఎస్ అగ్రనేతలు కేసీఆర్, కేటీఆర్‌పై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడారు.

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ అగ్రనేతలు కేసీఆర్, కేటీఆర్‌పై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడారు. కేటీఆర్‌లా దోచుకోవడం.. దాచుకోవడం తమకు తెలియదని విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలో రైతులకు బేడీలు వేసి అరిగోస పెట్టించారని అన్నారు. అలా హింసించడం తనకు తెలియదని వెల్లడించారు. అంతేకాదు.. మీలా డ్రగ్స్ తీసుకోవడం తనకు తెలియదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం, ఫార్ములా ఈరేస్ కేసు, విద్యుత్ కొనుగోళ్లలో అవినీతి చేయడం కూడా తెలియదని హాట్ కామెంట్స్ చేశారు. ఇకనైనా కేటీఆర్ నోరు అదుపులో పెట్టుకోవాలని.. లేకపోతే పరిస్థితులు వేరేలా ఉంటాయని బండి సంజయ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఈ అహంకారం వల్లే కేసీఆర్ ఓడిపోయి ఫామ్‌హౌజ్‌కు పరిమితం అయ్యారని తెలిపారు. వరుస ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెబుతున్నా కూడా కేటీఆర్‌లో మార్పు రావడం లేదని.. ఇంకా అదే అహంకారం కనిపిస్తుందని విమర్శించారు.
ఢిల్లీ నుండి మేం నిధులు తెస్తుంటే..
ఈనెల 10న పరేడ్ గ్రౌండ్‌లో జరగబోయే ప్రధాని మోడీ బహిరంగ సభను విజయవంతం చేయాలని రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు. ‘తెలంగాణ అభివృద్ధి కోసం కేంద్రం రూ.వేల కోట్ల నిధులిస్తోంది. కేంద్ర నిధులతోనే తెలంగాణలో అంతో ఇంతో అభివృద్ధి జరుగుతోంది. కేంద్రం నిధులివ్వకపోతే తెలంగాణ అభివృద్ధి చెందే అవకాశమే లేదు. ఢిల్లీ నుండి మేం నిధులు తెస్తుంటే.. కాంగ్రెసోళ్లు తెలంగాణ సొమ్మును ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలకు పంపుతున్నారు. కాంగ్రెస్ పార్టీని నడుపుకోవడానికి తెలంగాణ సొమ్మును వాడుకుంటున్నారు. డబుల్ ఇంజిన్ సర్కార్‌తోనే తెలంగాణ మరింత అభివృద్ధి సాధ్యం. తెలంగాణ ప్రజల ఆశీర్వాదం కోసం మోడీ వస్తున్నారు. తెలంగాణను అభివృద్ధి చేయడమే మోడీ నినాదం’ అని బండి సంజయ్ పేర్కొన్నారు.
‘ఆయన చివరి కోరిక నెరవేరుస్తా’: కొడంగల్‌లో CM రేవంత్ కీలక ప్రకటన






