- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘బండి సంజయ్ అప్పగించలేదు.. అరెస్ట్ చేశాం’ భగీరథ్ ఇష్యూపై CM రేవంత్ కామెంట్స్
బండి భగీరథ్ పోక్సో కేసులో చట్టప్రకారమే అరెస్ట్ జరిగిందని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. మైనర్ బాలికను అడ్డుపెట్టుకుని కేటీఆర్ రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు.

దిశ, డైమిక్ బ్యూరో: బండి భగీరథ్‍పై నమోదైన పోక్సో కేసులో పోలీసులు పద్దతి ప్రకారం దర్యాప్తు చేస్తున్నారని ఫిర్యాదు వచ్చిన వెంటనే భగీరథ్ కేసులో చర్యలు తీసుకున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. భగీరథ్ లొంగిపోలేదని పోలీసులు అతడిని అరెస్టు చేశారని స్పష్టం చేశారు. తనిఖీల్లో బండి భగీరథ్ దొరికాడని పోలీసులు చెప్పారని నేను పోలీసుల మాటలనే నమ్ముతున్నానని చెప్పారు. గురువారం సచివాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. భగీరథ్‍పై నమోదైన పోక్సో కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ జడ్జీలుగా మారి తీర్పులు ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోక్సో కేసులో బాధితుల వివరాలు బహిర్గతం చేయకూడదని కానీ వీరు మైనర్ అమ్మాయిని అడ్డు పెట్టుకుని రాజకీయం చేస్తున్నారు. బీఆర్ఎస్ నేతల మాదిరిగా రోడ్డుమీద పడి మాట్లాడితే బాధిత కుటుంబం ఆవేదన ఎలా ఉంటుందని ప్రశ్నించారు.
కేటీఆర్ మనిషివేనా?:
భగీరథ్ అంశంలో కేటీఆర్ మనిషిలా ప్రవర్తించడం లేదంటూ సీఎం ఫైర్ అయ్యారు. కేటీఆర్‍కు రాజకీయాలు కావాలంటే రాజకీయంగా కొట్లాడాలన్నారు. అంతే తప్ప ఒక మైనర్ బాలికను అడ్డం పెట్టుకుని రాజకీయంగా ఏదో సాధించామనే ఈ శాడిజం ఏంటి అని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో కేటీఆర్ బావమరిది ఫామ్ హౌస్‍లో నేరుగా డ్రగ్స్ తీసుకుంటూ దొరికిపోతే ఆ సమయమంలో తన బావమరిదిని అరెస్టు చేయాలని ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు. అదే పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్సీ కోడిపందేలు నిర్వహిస్తు దొరికిపోయాడు. దుబాయ్‍లో చనిపోయిన టాలీవుడ్ నిర్మాత కేదార్ మిత్రుడు, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఫామ్ హౌస్ లో డ్రగ్స్ పార్టీ చేసుకుంటూ పోలీసులపై కాల్పులు జరిపారు. ఆ నాడు కేటీఆర్ ఏ బొక్కలో పడుకున్నాడని సీరియస్ అయ్యారు. చట్టాన్ని గౌరవిస్తామని చెబుతున్న కేటీఆర్ వారిని ఎందుకు పార్టీ నుంచి సస్పెండ్ చేయలేదని ప్రశ్నించారు. ఇంత కంటే సిగ్గుతప్పి ఎవరైనా మాట్లాడుతారా అని నిలదీశారు. డ్రగ్స్ కేసులో దొరికిన కేటీఆర్ బావమరిదికి నోటీసులు ఇచ్చారని పోక్సో కేసులో బండి భగీరథ్‍కు కూడా పోలీసులు నోటీసులు ఇచ్చారన్నారు. నోటీసులు ఇచ్చాక భగీరథ్ తరపున సమయం కోరారని, బాలిక మైనరా కాదా అనే విషయంలో ప్రభుత్వ సమాచారం సేకరించామన్నారు. అమ్మాయి మైనర్ అని నిర్ధారించుకున్నాక వెంటనే ప్రభుత్వం చర్యలు తీసుకుందని ప్రభుత్వ చర్యలను కోర్టు తప్పపట్టలేదన్నారు.
కేటీఆర్‍కు బండికి మధ్య ఏదో పంచాయతీ
ఏ కేసులోనైనా ప్రభుత్వం చట్ట ప్రకారమే నడుచుకుంటుందని సీఎం స్పష్టం చేశారు. డ్రగ్స్ తీసుకున్న వారిని బాధితులుగా చూడాలని చట్టం చెబుతోందన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికితే జైలుకు పంపిస్తున్నాం. అదే డ్రగ్స్, గంజాయి తీసుకుంటూ దొరికితే బాధితుడిగా చెబుతూ స్టేషన్ బెయిల్ ఇవ్వాలని చట్టంలో ఉంది. ఇప్పుడు ఏం చేయాలో మీరే చెప్పాలన్నారు. ఈ చట్టాల్లో ఉన్న లొసుగులను కేటీఆర్ ఆయన బావమరిది ఉపయోగించుకుంటున్నారని ఈ చట్టాలను సవరించాల్సిన అవసరం ఉందన్నారు. బండి భగీరథ్ కేసు చాల సున్నితమైన కేసు అని ఇందులో కేసు నమోదు చేసిన సెక్సెన్లు, అరెస్టు, రిమాండ్, కోర్టులో మా వాదనలో ఎక్కడైనా లోపముందా అని ప్రశ్నించారు. కేటీఆర్ కు బండి సంజయ్ కు ఎదో పంచాయతీ ఉందని దాన్ని పిల్లల మీద పెట్టి పగ సాధించాలనుకుంటే ఎట్లా అన్నారు.
కేసీఆర్ ఎక్కడ నిద్రపోతున్నారు? భగీరథ్ కేసులో సైలెన్స్ పై సీఎం ప్రశ్న






