రోహిత్ కెరీర్ ముగిసినట్టేనా?.. అదే ఆఖరి మ్యాచ్

by Harish |

భారత సీనియర్ బ్యాటర్, మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ కెరీర్ చరమాంకంలో ఉన్నాడు.

రోహిత్ కెరీర్ ముగిసినట్టేనా?.. అదే ఆఖరి మ్యాచ్
X

దిశ, స్పోర్ట్స్ : భారత సీనియర్ బ్యాటర్, మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ కెరీర్ చరమాంకంలో ఉన్నాడు. ఇప్పటికే టెస్టు, టీ20లకు వీడ్కోలు పలికిన అతను కేవలం వన్డేలు మాత్రమే ఆడుతున్నాడు. అయితే, ప్రస్తుతం ఇంగ్లాండ్ టూరులో ఉన్న అతనికి ఈ పర్యటననే చివరిదన్న వార్తలు వస్తున్నాయి. 39 ఏళ్ల రోహిత్ వచ్చే ఏడాది వన్డే వరల్డ్ కప్‌లో ఆడి రిటైర్మెంట్ ప్రకటించాలని భావిస్తున్నాడు. కానీ, అతను ఆ ప్రపంచకప్ ఆడే విషయంలో ఎప్పటి నుంచి సందేహాలు నెలకొన్నాయి. అయితే, తాజాగా బీసీసీఐ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. అతను వరల్డ్ కప్ ప్రణాళికల్లో లేడని తెలిసింది. ఇంగ్లాండ్ టూరులో రెండు వన్డేల్లోనూ అతను నిరాశపరిచాడు. వరుసగా 11, 26 రన్స్ మాత్రమే చేశాడు. ఆదివారం లార్డ్స్ స్టేడియంలో జరిగే మూడో వన్డేనే అతనికి చివరిది కానున్నట్టు ప్రచారం జరుగుతుంది. ఇంగ్లాండ్ టూరు తర్వాత రోహిత్‌ను పక్కనపెట్టాలని సెలెక్టర్లు భావిస్తున్నట్టు పలు కథనాలు పేర్కొన్నాయి. వన్డే వరల్డ్ కప్ ప్రణాళికల్లో లేవని రోహిత్‌కు ఇప్పటికే సెలెక్టర్లు తెలియజేశారని, అతని భవిష్యత్తుపై నిర్ణయాన్ని అతనికే వదిలేసినట్టు తెలిపాయి. సెలెక్టర్ల నిర్ణయంపై హిట్‌మ్యాన్ అసంతృప్తి వ్యక్తిం చేసినట్టు సమాచారం. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని సెలెక్టర్లు రోహిత్‌కు బదులు యశస్వి జైశ్వాల్‌‌కు ఎక్కువ అవకాశాలు ఇవ్వాలని భావిస్తున్నట్టు బీసీసీఐ అధికారి ఒకరు మీడియాతో తెలిపారు. ‘ప్రపంచకప్ నాటికి 20 మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఆ మ్యాచ్‌ల్లో జైశ్వాల్‌కు చాన్స్ ఇవ్వాలి. రోహిత్‌ను రిటైర్ అవ్వాలని ఎవరూ చెప్పలేు. సెప్టెంబర్‌లో వెస్టిండీస్‌తో జరిగే సిరీస్‌కు సెలెక్టర్లు ముందు చూపుతో వ్యవహరించాలని అనుకుంటున్నారు.’అని సదరు అధికారి పేర్కొన్నారు.


Next Story