300-310 ప‌రుగులు చేసి..గెలుస్తామ‌ని అనుకున్నాం, కానీ !

by velandi.Saikiran |

300-310 ప‌రుగులు చేసి..గెలుస్తామ‌ని అనుకున్నాం, కానీ మా బ్యాట‌ర్లు చెత్త‌గా ఆడార‌ని ఫైర్ అయ్యారు గిల్.

300-310 ప‌రుగులు చేసి..గెలుస్తామ‌ని అనుకున్నాం, కానీ !
X

దిశ‌, వెబ్ డెస్క్: రెండో వన్డేలో భారత్ ఓడిపోవడంపై కెప్టెన్ శుభ‌మాన్‌ గిల్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇంగ్లాండ్ తో జ‌రిగిన‌ రెండో వన్డేలో 233 పరుగులకే భార‌త్ ఆలౌట్ కావడం చాలా దురదృష్టకరం అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. తమకు మంచి స్టార్ట్ వచ్చిందని... ఈ క్రమంలో 300కు పైగా పరుగులు చేస్తామని అనుకున్నట్లు వివరించారు గిల్. కానీ మిడిల్ ఓవర్లలో చాలా వికెట్లు కోల్పోయామని, లోయర్ ఆర్డర్ నుంచి ఇంకా పరుగులు వస్తే బాగుండన్నారు. వాషింగ్టన్ సుందర్ బ్యాటింగ్ చేస్తుండగా గాయపడ్డాడని, అతడు బౌలింగ్ కు రాకపోవడంతో స్ట్రాటజీలను మార్చుకోవాల్సి వచ్చిందని వెల్లడించారు. ఇలా చిన్నచిన్న తప్పిదాల వల్ల తమ జట్టు ఓడిపోయిందన్నారు. మూడో వన్డేలో మాత్రం పుంజుకుంటామని స్పష్టం చేశారు గిల్. కాగా 234 పరుగు లక్ష్యాన్ని 44.1 ఓవర్లలో ఇంగ్లాండ్ ఛేదించింది.

Next Story