OTTలోకి వచ్చేసిన రెండు కొత్త సినిమాలు..స్ట్రీమింగ్ ఎక్క‌డంటే

by velandi.Saikiran |   (  Updated:2026-07-16 22:15:18  IST  )

వీకెండ్ వస్తున్న నేపథ్యంలో OTTలోకి సరికొత్త సినిమాలు వచ్చేశాయి.

OTTలోకి వచ్చేసిన రెండు కొత్త సినిమాలు..స్ట్రీమింగ్ ఎక్క‌డంటే
X

దిశ‌, వెబ్ డెస్క్: వీకెండ్ వస్తున్న నేపథ్యంలో OTTలోకి సరికొత్త సినిమాలు వచ్చేశాయి. ఇందులో సమంత నటించిన మా ఇంటి బంగారంతో పాటు, సీనియర్ హీరో నవీన్ చేసిన ట్రాన్స్ ఫర్ త్రిమూర్తులు మూవీ కూడా ఉంది. సమంత లీడ్ రోల్ చేసిన మా ఇంటి బంగారం అర్ధరాత్రి నుంచి జియో హాట్ స్టార్ లో అందుబాటులోకి వచ్చేసింది. తెలుగుతో పాటు కన్నడ, మలయాళం, తమిళ భాషల్లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. నందిని రెడ్డి దర్శకత్వంలో వచ్చిన మా ఇంటి బంగారం సినిమా 100 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. ఇక అటు వడ్డే నవీన్ 10 సంవత్సరాల తర్వాత హీరోగా మళ్లీ రీ-ఎంట్రీ ఇచ్చాడు. ట్రాన్స్ ఫర్ త్రిమూర్తులు అనే ఫ్యామిలీ మూవీతో సందడి చేశారు. అయితే ఈ మూవీ జనాలకు పెద్దగా ఎక్కలేదు. జి5 లో ఈ మూవీ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది.

Next Story