- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పోక్సో కేసులో హైడ్రామాకు తెర.. ఎట్టకేలకు లొంగిపోయిన బండి భగీరథ్
బండి భగీరథ్ పై నమోదైన పోక్సో కేసులో హైడ్రామాకు తెరపడింది. న్యాయవాదుల సమక్షంలో అతను పోలీసుల ఎదుట లొంగిపోయాడు.

దిశ, వెబ్‌డెస్క్: గతకొన్ని రోజులుగా తీవ్ర సంచలనం సృష్టిస్తోన్న పోక్సో కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. బండి భగీరథ్ ఎట్టకేలకు లొంగిపోయారు. న్యాయవాదుల సమక్షంలో తెలంగాణ పోలీసుల ఎదుట బండి భగీరథ్ లొంగిపోయాడు. ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు తెలంగాణ హైకోర్టు నిరాకరించడం, చట్టపరమైన రక్షణ లభించకపోవడంతో ఆయన పోలీసులకు లొంగిపోక తప్పని పరిస్థితి ఏర్పడింది. మరోవైపు.. ఈ కేసును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న తెలంగాణ పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. భగీరథ్ విచారణకు హాజరు కాకుండా పరారీలో ఉండటంతో, ఆయన దేశం విడిచి వెళ్లకుండా ఉండేందుకు వీలుగా కాసేపటి క్రితమే లుకౌట్ నోలీసులు సైతం జారీ చేశారు. ఈ క్రమంలోనే ఉచ్చు బిగుస్తుండటం గమనించిన భగీరథ్, ఆయన న్యాయవాదుల సలహా మేరకు పోలీసుల ఎదుట లొంగిపోయినట్లు తెలుస్తోంది.
ఒక మైనర్ బాలికను వేధించారనే ఆరోపణలపై బండి భగీరథ్‌పై పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో పోక్సో చట్టం కింద కేసు నమోదు అయిన విషయం తెలిసిందే. గతంలోనూ పోలీసులు విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇచ్చినప్పటికీ ఆయన గైర్హాజరు అయ్యారు. దీంతో ప్రత్యేక బృందాలను రంగంలోకి దించిన పోలీసులు.. కరీంనగర్, ఢిల్లీ, హైదరాబాద్ నగరాల్లో విస్తృతంగా గాలించారు. శనివారం సాయంత్రం వరకూ అతని ఇంటిలో సోదాలు నిర్వహించారు. భగీరథ్ ఆచూకీ ఎక్కడా తెలియకపోవడంతో చివరకు లుకౌట్ నోటీసులు జారీ చేయడంతో హైడ్రామాకు తెరపడింది. ప్రస్తుతం భగీరథ్ పోలీసుల అదుపులో ఉన్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
మంత్రివర్గం నుంచి బండి సంజయ్ ను తొలగించాలి : ప్రధానికి కవిత లేఖ






