- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మంత్రివర్గం నుంచి బండి సంజయ్ ను తొలగించాలి : ప్రధానికి కవిత లేఖ
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడి మీద నమోదైన పోక్సో కేసులో విచారణ పారదర్శకంగా జరగాలంటే ఆయనను మంత్రి వర్గం నుంచి తొలగించాలని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత డిమాండ్చేశారు.

- ఆయన కుమారుడి మీద నమోదైన పోక్సో కేసులో విచారణ
- పారదర్శకంగా జరగాలంటే మంత్రి పదవిలో ఉండొద్దు
దిశ, తెలంగాణ బ్యూరో : కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడి మీద నమోదైన పోక్సో కేసులో విచారణ పారదర్శకంగా జరగాలంటే ఆయనను మంత్రి వర్గం నుంచి తొలగించాలని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత డిమాండ్చేశారు. శనివారం ప్రధాని మోడీకి లేఖలో పేర్కొంటూ ఆయన కుమారుడి మీద అత్యంత తీవ్రమైన పోక్సో కేసు నమోదైనందున కేసు విచారణ పారదర్శకంగా జరగాలంటే పదవిలో ఉండకూడదన్నారు. ఈ కేసులో ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లు లేకుండా స్వతంత్ర విచారణ జరిగేందుకు మోడీ చొరవ చూపాలని, దేశంలో మైనర్ల రక్షణ కన్నా రాజకీయ ప్రయోజనాలు ఎక్కువ కాదని ప్రధాని గుర్తించాలన్నారు. బాధితురాలికి పూర్తి న్యాయం జరగాలన్నా, ప్రజాస్వామ్య వ్యవస్థల పట్ల ప్రజల్లో నమ్మకం కలగాలన్న విచారణలో ఎలాంటి రాజకీయ జోక్యం ఉండొద్దని సూచించారు. ఈ కేసు విచారణ పూర్తయ్యే వరకు బండి సంజయ్ ను మంత్రివర్గం నుంచి తప్పించాలని పేర్కొన్నారు. ఆయన కుమారుడిపై పెట్‌బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో భారతీయ న్యాయ సంహిత, అలాగే అత్యంత తీవ్రమైన బాలల లైంగిక నేరాల నిరోధక చట్టం కింద ఎఫ్‌ఐఆర్ నమోదైంది. మైనర్ బాలికకు సంబంధించిన కేసు కావడంతో ఈ దర్యాప్తు లోఎటువంటి రాజకీయ ఒత్తిళ్లు లేకుండా స్వతంత్రంగా విచారణ జరగాల్సిన అవసరం ఉందన్నారు. బండి సంజయ్ ప్రస్తుతం దేశంలోనే అత్యంత కీలకమైన, చట్టాన్ని అమలు చేసే అధికారాలు గల కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా కొనసాగుతున్నారు. చట్టపరంగా ఆయన కుమారుడి పై నేర నిరూపణ అనేది న్యాయస్థానం తేల్చాల్సిన విషయమే. కానీ ఆయన అదే పదవిలో కొనసాగితే దర్యాప్తు ప్రక్రియ, సాక్ష్యాల సేకరణ, సాక్షుల రక్షణపై ప్రభావం పడే అవకాశం ఉంది. ఈ కేసులో బాధితురాలికి పూర్తి న్యాయం జరగాలన్నా, ప్రజాస్వామ్య వ్యవస్థల పట్ల ప్రజల్లో నమ్మకం కలగాలన్న విచారణలో రాజకీయ జోక్యం ఉండకూడదు. దేశంలోని మైనర్ల రక్షణ, న్యాయవ్యవస్థ సమగ్రత అనేది రాజకీయ ప్రయోజనాల కంటే మిన్న. అందుకే కేసు దర్యాప్తు , న్యాయస్థాన విచారణ పూర్తయ్యే వరకు బండి సంజయ్ కుమార్‌ను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి పదవి నుండి తక్షణమే తొలగించాలని పేర్కొన్నారు.
పోక్సో కేసులో హైడ్రామాకు తెర.. ఎట్టకేలకు లొంగిపోయిన బండి భగీరథ్






