- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అదొక బక్వాస్ సినిమా.. 'ధురంధర్ 2' పై అసదుద్దీన్ ఒవైసీ ఫైర్
బాలీవుడ్ నటుడు రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో, ప్రముఖ దర్శకుడు ఆదిత్య ధార్ తెరకెక్కించిన హై-వోల్టేజ్ యాక్షన్ డ్రామా 'ధురంధర్ 2' రాజకీయ దుమారం రేపుతోంది.

దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ నటుడు రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో, ప్రముఖ దర్శకుడు ఆదిత్య ధార్ తెరకెక్కించిన హై-వోల్టేజ్ యాక్షన్ డ్రామా 'ధురంధర్ 2' రాజకీయ దుమారం రేపుతోంది. ఈ సినిమాపై ఎంఐఎం పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ దీనిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. హైదరాబాద్‌లో జరిగిన ఒక సమావేశంలో ఒవైసీ మాట్లాడుతూ.. ఈ సినిమా సమాజంలో విభజనను పెంచుతోందని మండిపడ్డారు. ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాలు, సంభాషణలు కేవలం హింసను ప్రేరేపించేలా ఉన్నాయని, ఇది బక్వాస్(అర్థం లేని సినిమా) అని ఆయన అభివర్ణించారు. సినిమాల ద్వారా ఒక వర్గాన్ని లక్ష్యంగా చేసుకోవడం లేదా దేశభక్తి పేరుతో విద్వేషాన్ని వ్యాప్తి చేయడం సరికాదని ఆయన హితవు పలికారు. ఇలాంటి చిత్రాలు యువతపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. అసలు ఇలాంటి సినిమాలు చూసేందుకు ఎవరి దగ్గరా అంత సమయం ఉండదని అన్నారు.
సినిమా నేపథ్యం..
ఆదిత్య ధార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో రణవీర్ సింగ్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ పాత్రలో కనిపించారు. భారీ తారాగణంతో రూపొందిన ఈ చిత్రం దేశ భద్రత, ఉగ్రవాద వ్యతిరేక పోరాటం చుట్టూ తిరుగుతుంది. ఈ చిత్రంలో సంజయ్ దత్, ఆర్.మాధవన్, అర్జున్ రాంపాల్ వంటి దిగ్గజ నటులు కూడా నటించారు. మరోవైపు, చిత్ర బృందం ఈ విమర్శలను తోసిపుచ్చింది. ఇది పూర్తిగా దేశభక్తిని చాటిచెప్పే కల్పిత కథ అని, ఎవరినీ కించపరచడం తమ ఉద్దేశ్యం కాదని స్పష్టం చేసింది. గతంలోనూ 'ది కాశ్మీర్ ఫైల్స్', 'ది కేరళ స్టోరీ' వంటి చిత్రాల విషయంలో ఒవైసీ తన అభ్యంతరాలను వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు 'ధురంధర్ 2'పై కూడా అదే బాటలో విమర్శలు చేయడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.






