కల్కి 2 షూటింగ్‌లో అప్పటినుండి జాయిన్ కానున్న ప్రభాస్

by Pulgam srinivas |   (  Updated:2026-03-28 14:37:52  IST  )

కల్కి–2 షూటింగ్‌కు సిద్ధమవుతున్న ప్రభాస్... ఏప్రిల్‌లో ఎంట్రీ.

కల్కి 2 షూటింగ్‌లో అప్పటినుండి జాయిన్ కానున్న ప్రభాస్
X

దిశ, వెబ్ డెస్క్: రెబల్ స్టార్ ప్రభాస్ కెరీర్‌లో అద్భుతమైన విజయాన్ని సాధించిన చిత్రాలలో కల్కి 2898 AD ఒకటి. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో దిశా పటాని హీరోయిన్‌గా నటించగా, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనే కీలక పాత్రల్లో నటించారు. అలాగే కమల్ హాసన్ విలన్ పాత్రలో నటించి ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాడు. ఈ సినిమా మొదటి భాగం భారీ విజయాన్ని అందుకోవడంతో రెండో భాగంపై ప్రేక్షకుల్లో భారీ స్థాయిలో ఆసక్తి నెలకొంది. ఇప్పటికే కల్కి 2898 AD రెండో భాగం షూటింగ్ ప్రారంభమైనట్లు సమాచారం.

ఏప్రిల్ నెల నుండి ప్రభాస్ కూడా ఈ చిత్ర షూటింగ్‌లో పాల్గొనబోతున్నట్లు సినీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ప్రస్తుతం ప్రభాస్ ఈ చిత్రంతో పాటు దర్శకుడు హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఫౌజీ’ సినిమాలో కూడా నటిస్తున్నాడు. ఈ సినిమాపై కూడా ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి. రాజా సాబ్ చిత్రంతో నిరుత్సాహపరిచిన ప్రభాస్ ఈ రెండు చిత్రాలతో భారీ విజయాలను అందుకుంటాడని ఆయన అభిమానులు భావిస్తున్నారు.

ఆ సినిమాలో నటిస్తున్నందుకు ఆనందంగా ఉంది.. ప్రభాస్ చిత్రం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన జయప్రద

అదొక బక్వాస్ సినిమా.. 'ధురంధర్ 2' పై అసదుద్దీన్ ఒవైసీ ఫైర్

Next Story