- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆ సినిమాలో నటిస్తున్నందుకు ఆనందంగా ఉంది.. ప్రభాస్ చిత్రం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన జయప్రద
ప్రభాస్ ‘ఫౌజీ’లో నటిస్తున్నా.. చాలా ఆనందంగా ఉంది: జయప్రద

దిశ, వెబ్ డెస్క్: సీనియర్ నటి జయప్రద గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈమె ఎన్నో సంవత్సరాల పాటు తెలుగు, తమిళ చిత్రాల్లో నటించి తిరుగులేని నటిగా తన కెరీర్‌ను విజయవంతంగా కొనసాగించింది. అయితే ఈ మధ్యకాలంలో మాత్రం ఈమె కాస్త తక్కువగానే సినిమాల్లో కనిపిస్తోంది. తాజాగా సినీ నటి మంచు లక్ష్మి ‘టీచ్ ఫర్ చేంజ్’ అనే కార్యక్రమాన్ని నిర్వహించింది. ఆ కార్యక్రమానికి జయప్రద కూడా హాజరయ్యింది. ఈ సందర్భంగా ఆమె మీడియాతో ముచ్చటిస్తూ ప్రస్తుతం తాను చేస్తున్న ఓ చిత్రం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
జయప్రద మాట్లాడుతూ... తాను ప్రభాస్ హీరోగా, హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఫౌజీ’ చిత్రంలో నటిస్తున్నానని తెలిపింది. ఆ సినిమాలో నటించడం తనకు చాలా ఆనందంగా ఉందని వెల్లడించింది. ఇక ‘టీచ్ ఫర్ చేంజ్’ కార్యక్రమం గురించి మాట్లాడుతూ... మంచు లక్ష్మి ఎంతో గొప్ప ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిందని జయప్రద ప్రశంసించింది. పేద మరియు వెనుకబడిన వర్గాల పిల్లలకు నాణ్యమైన విద్య అందించడం ధ్యేయంగా ఈ సంస్థను లక్ష్మి ప్రారంభించిందని చెప్పింది. కొంతకాలం క్రితం ఈ సంస్థ నిర్వహించబోయే ఒక కార్యక్రమానికి తప్పక హాజరుకావాలని లక్ష్మి తనను కోరిందని, ఆమె తనకు బిడ్డ లాంటిదని, ఆమె ఒక్క మాట చెప్పగానే ఈ కార్యక్రమానికి వచ్చానని జయప్రద చెప్పుకొచ్చింది.






