- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మావోయిస్టులకు గట్టి ఎదురుదెబ్బ.. కీలక నేత ఎర్రగొల్ల రవి సహా ముగ్గురు DVCM క్యాడర్ సభ్యులు అరెస్ట్..?
డివిజనల్ కమిటీ సభ్యుడు (DVCM) క్యాడర్‌కు చెందిన కీలక నేత ఎర్రగొల్ల రవితో పాటు మరో ఇద్దరు డివిజనల్ కమిటీ సభ్యులను (DVCM) పోలీసులు పట్టుకున్నట్లు సమాచారం అందుతుంది.

దిశ, వెబ్ డెస్క్: మావోయిస్టు పార్టీ వ్యతిరేక ఆపరేషన్‌లో భాగంగా కీలక పరిణామం చోటు చేసుకుంది. డివిజనల్ కమిటీ సభ్యుడు (DVCM) క్యాడర్‌కు చెందిన కీలక నేత ఎర్రగొల్ల రవితో పాటు మరో ఇద్దరు డివిజనల్ కమిటీ సభ్యులను (DVCM) పోలీసులు పట్టుకున్నట్లు సమాచారం అందుతుంది. ఎర్రగొల్ల రవి లాంటి కీలక నాయకుడిని అరెస్టు చేయడం మావోయిస్టు పార్టీకి గట్టి ఎదురుదెబ్బగా పరిగణించవచ్చు. కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం ఆరెపల్లి గ్రామానికి చెందిన ఎర్రగొల్ల రవి, 2001లో అజ్ఙాతంలోకి వెళ్లారు. ఆయనపై ఐదు లక్షల రివార్డు కూడా ఉంది. ఈ అరెస్టుతో మావోయిస్టుల కదలికలు, కార్యకలాపాలపై మరింత సమాచారం తెలిసే అవకాశం ఉందని పోలీస్ వర్గాలు భావిస్తున్నాయి.
మరోవైపు, మావోయిస్టులను అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు ఇటీవల తమ కూంబింగ్ ఆపరేషన్లను ముమ్మరం చేశారు. ఈ నిరంతర నిఘా, పటిష్టమైన చర్యల ఫలితంగానే ఎర్రగొల్ల రవితో పాటు అదనంగా మరో రెండు DVCM క్యాడర్లను కూడా పోలీసులు విజయవంతంగా అదుపులోకి తీసుకోగలినట్లు సమాచారం అందుతుంది. ఈ ముగ్గురు కీలక నేతల అరెస్టులు మావోయిస్టు ఉద్యమంలోని నాయకత్వ శ్రేణిని దెబ్బతీశాయి. ఈ అరెస్టుల ద్వారా మావోయిస్టుల యొక్క భవిష్యత్తు వ్యూహాలు, కార్యకలాపాలపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
Read More... మావోయిస్టుల అరెస్టును ఖండించిన తెలంగాణ రాష్ట్ర కమిటీ






