- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మావోయిస్టు పార్టీకి మరో ఎదురుదెబ్బ.. కాసేపట్లో డీజీపీ ఎదుట అగ్రనేతల సరెండర్
దండకారణ్యాల్లో వరుస ఎన్‌కౌంటర్లు, కీలక నేతలు ప్రాణాలు కోల్పోయి సతమతమవుతున్న తరుణంలో మావోయిస్టు పార్టీకి మరో ఎదురుదెబ్బ తగలబోతోంది.

దిశ, తెలంగాణ బ్యూరో/భద్రాచలం: ఆపరేషన్ కగార్, లొంగుబాట్లు, వరుస ఎన్‌కౌంటర్లు, కీలక నేతలు ప్రాణాలు కోల్పోయి సతమతమవుతున్న మావోయిస్టు పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఇవాళ మధ్యాహ్నం తెలంగాణ డీజీపీ శివధర్‌రెడ్డి సమక్షంలో మెగా సరెండర్ కార్యక్రమం జరుగనుంది. మొత్తం 37 మంది మావోయిస్టులు లొంగిపోబోతున్నారు. వీరిలో అగ్రనేతలు ఆజాద్, అప్పాసి నారాయణ, ఎర్రాలు, సికాస కార్యదర్శి అశోక్, నలుగురు తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యులు, తదితర ముఖ్య నాయకులు ఉన్నట్లు తెలుస్తోంది.
ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు డీజీపీ కార్యాలయంలోని టెన్నిస్ కోర్టు గ్రౌండ్‌లో మీడియా సమావేశాన్ని నిర్వహించనున్నట్లుగా డీజీపీ ఆఫీసు నుంచి ఉదయం ప్రకటన వెలువడింది. కాగా, ఈ ఏడాదిలో మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు అలియాస్ బస్వరాజ్, కేంద్ర కమిటీ సభ్యులు చలపతి, బాలకృష్ణ, గణేశ్, కట్టా రామచంద్రారెడ్డి, కడారి సత్యనారాయణరెడ్డి, హిడ్మా వరుస ఎన్‌కౌంటర్‌లలో మృతి చెందిన విషయం తెలిసిందే. పార్టీకి ఎదురవుతున్న గడ్డు పరిస్థితులతో అగ్రనేతలు మల్లోజుల వేణుగోపాల్, ఆశన్న లొంగిపోయారు. ఇటీవల తెలంగాణ కేంద్ర కమిటీ సభ్యుడు చంద్రన్న, రాష్ట్ర కమిటీ సభ్యుడు బండి ప్రకాశ్, మరికొంత మంది కూడా డీజీపీ శివధర్‌రెడ్డి ఎదుట సరెండర్ అయిన విషయం తెలిసిందే.
Read More..






