- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విప్లవోద్యమం ఇంకా జీవించే ఉంది.. పీఎల్జీఏ సంచలన లేఖ
ఓ వైపు భద్రతా బలగాలు ముమ్మరంగా ‘ఆపరేషన్ కగార్’ చేపడుతున్న నేపథ్యంలో మావోయిస్టు పార్టీకి చెందిన ప్రజా విముక్త గెరిల్లా సైన్యం (పీఎల్జీఏ) 25వ వార్షికోత్సవాలను డిసెంబర్ 2 నుంచి 8 వరకు దేశవ్యాప్తంగా విప్లవోత్సాహంతో జరుపుకోవాలని పార్టీ సెంట్రల్ మిలిటరీ కమిషన్ (సీఎంసీ) పిలుపునిచ్చింది.

దిశ, వెబ్‌డెస్క్: ఓ వైపు భద్రతా బలగాలు ముమ్మరంగా ‘ఆపరేషన్ కగార్’ చేపడుతున్న నేపథ్యంలో మావోయిస్టు పార్టీకి చెందిన ప్రజా విముక్త గెరిల్లా సైన్యం (పీఎల్జీఏ) 25వ వార్షికోత్సవాలను డిసెంబర్ 2 నుంచి 8 వరకు దేశవ్యాప్తంగా విప్లవోత్సాహంతో జరుపుకోవాలని పార్టీ సెంట్రల్ మిలిటరీ కమిషన్ (సీఎంసీ) పిలుపునిచ్చింది. తాజాగా సీఎంసీ పేరుతో విడుదలైన 16 పేజీల సందేశంలో విప్లవ ప్రతిఘాతక ‘ఆపరేషన్ కగార్’ ఎదుర్కొంటూ పార్టీ, పీఎల్జీఏ, ప్రజా సంఘాలు, విప్లవోద్యమాన్ని కాపాడుకోవాలని, సామ్రాజ్యవాద, దళారీ నిరంకుశ పెట్టుబడిదారీ, భూస్వామ్య వర్గాల కూటమికి వ్యతిరేకంగా, బ్రాహ్మణీయ హిందుత్వ ఫాసిస్టు RSS-బీజేపీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా గెరిల్లా పోరాటాన్ని తీవ్రతరం చేయాలని సీఎంసీ ఆదేశించింది.
320 మంది కామ్రేడ్లు అమరులు
2024 డిసెంబర్ నుంచి 2025 నవంబర్ వరకు అంటే 11 నెలల కాలంలో దేశ వ్యాప్తంగా 320 మంది మావోయిస్టు కామ్రేడ్లు అమరులయ్యారని తాజాగా విడుదల చేసిన లేఖలో ప్రస్తావించారు. వారిలో పార్టీ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ బసవరాజు (Basavaraju), 8 మంది సెంట్రల్ కమిటీ సభ్యులు, 15 మంది రాష్ట్ర కమిటీ స్థాయి నేతలు ఉన్నారని తెలిపారు. కేవలం ఒక్క ఛత్తీస్‌గఢ్‌లోనే 243 మంది అమరులు అయ్యారని పేర్కొన్నారు. ఈ హఠాత్పరిణామం మావోయిస్టు పార్టీతో పాటు విప్లవోద్యమానికి తీవ్ర నష్టమని సీఎంసీ అభివర్ణించింది.
శత్రు బలగాలకూ నష్టం
‘ఆపరేషన్ కగార్’లో భాగంగా ఇదే సమయంలో పీఎల్జీఏ ఆత్మరక్షణ గెరిల్లా ప్రతి చర్యల్లో 116 మంది పోలీసులు, కేంద్ర బలగాల సిబ్బంది మరణించారని పేర్కొన్నారు. అదేవిధంగా 208 మంది గాయపడ్డారని వివరాంచారు. అనేక ఐఈడీ దాడులు, ఆంబుష్‌లు, పోలీసు ఇన్ఫామర్లు, బీజేపీ నాయకులపై దాడులు జరిగాయని పీఎల్జీఏ తన సందేశంలో పేర్కొంది
ప్రధాన లక్ష్యాలు ఇవే..
ప్రజా విముక్త గెరిల్లా సైన్యం (పీఎల్జీఏ) 25వ వార్షికోత్సవాల సందర్భంగా పార్టీ నాయకత్వం తమ ముందు ఉన్న ప్రధాన లక్ష్యాలను లేఖలో స్పష్టంగా ప్రస్తావించింది. మొదట నాయకత్వ, బలగాల రక్షణకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్లుగా పేర్కొన్నారు. అదేవిధంగా గెరిల్లా యుద్ధ నియమాలను కచ్చితంగా అమలు చేయడం, కేంద్రీకృత బలగాలను వికేంద్రీకృతం చేయాలని నిర్ణయించినట్లుగా వెల్లడించారు. అటవీ, మైదాన, పట్టణ ప్రాంతాల్లో రాజకీయ, సైనిక, సామూహిక కార్యకలాపాలను విస్తరించడంపై ఫోకస్ పెట్టనున్నట్లుగా తెలిపారు.
‘ఆపరేషన్ కగార్’తో పార్టీకి తీవ్ర నష్టాలు జరుగుతున్నప్పటికీ విప్లవోద్యమం ఇంకా జీవించి ఉందని, అదే స్ఫూర్తిని కాపాడుకుంటూ ముందుకు తీసుకెళ్లాలని పార్టీ శ్రేణులకు, పీఎల్జీఏ యోధులకు, ప్రజా సంఘాలకు, పీడిత ప్రజలకు 25వ వార్షికోత్సవ సందర్భంగా పార్టీ సెంట్రల్ మిలిటరీ కమిషన్ పిలుపునిచ్చింది.
పీఎల్‌జీఏ లేఖ: https://epaper.dishadaily.com/4085253/Dishaweb/22-11-2025#page/1/1
మావోయిస్టు పార్టీకి మరో ఎదురుదెబ్బ.. కాసేపట్లో డీజీపీ ఎదుట అగ్రనేతల సరెండర్






