డిసెంబర్‌ లోపే తెలంగాణకు కొత్త ముఖ్యమంత్రి: ఎమ్మెల్యే సంచలన జోస్యం

by Gantepaka Srikanth |   (  Updated:2025-08-07 15:16:42  IST  )

డిసెంబర్‌ లోపే తెలంగాణకు కొత్త ముఖ్యమంత్రి: ఎమ్మెల్యే సంచలన జోస్యం

డిసెంబర్‌ లోపే తెలంగాణకు కొత్త ముఖ్యమంత్రి: ఎమ్మెల్యే సంచలన జోస్యం
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో కొన్ని రోజుల్లో ముఖ్యమంత్రి మార్పు ఉండబోతోందని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి(Alleti Maheshwar Reddy) సంచలన జోస్యం చెప్పారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీఎం కుర్చీని కాపాడుకునేందుకే రేవంత్ రెడ్డి(Revanth Reddy) బీసీ డ్రామా ఆడుతూ, రాహుల్ భ‌జ‌న, మోడీ దూష‌ణ‌ చేస్తున్నారని మండిపడ్డారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో ఇపుడు కాంగ్రెస్ స‌ర్కారు 42 శాతానికి పెంచుతున్న‌ట్టు చెబుతోంది.. అయితే ఇందులో 10 శాతం ముస్లిం రిజ‌ర్వేష‌న్లే అని అన్నారు. ముస్లింల 10 శాతాన్ని తీసేస్తే బీసీల‌కు మిగిలేది 32 శాత‌మే అని అన్నారు.

కులాల వారీగా జ‌నాభా వివ‌రాల‌ను స‌ర్కారు ఎందుకు వెల్లడించడం లేదని ప్రశ్నించారు. సోనియా, రాహుల్, ప్రియాంక‌, మ‌ల్లికార్జున ఖ‌ర్గే, కేసీ వేణుగోపాల్ వంటి కాంగ్రెస్ అగ్ర‌నేత‌లెవ‌రూ రేవంత్ రెడ్డి నిర్వ‌హించిన ధ‌ర్నాకు రాక‌పోవ‌డంతో రేవంత్ భవిష్యత్‌పై స్ప‌ష్ట‌త వ‌చ్చింది. రాహుల్ గాంధీ చాలా కాలంగా రేవంత్ రెడ్డికి అపాయింట్ మెంట్ ఇవ్వ‌క‌పోవ‌డం కూడా ఇందుకు నిద‌ర్శ‌నం అని ఏలేటి మహేశ్వర్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జనాభా ప్రకారం రాష్ట్రంలో బీసీల‌కు క‌నీసం ఎనిమిది మంత్రి ప‌ద‌వులు ఇవ్వాల్సిన కాంగ్రెస్ ఇచ్చింది కేవ‌లం ముగ్గురికే ఇచ్చింది. ఇంకా ఖాళీగా ఉన్న మూడు మంత్రులను అయినా బీసీలకు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

Read More..

‘ఎంత పాపం చేశావ్ రేవంత్’.. కేటీఆర్ ట్వీట్ వైరల్

ఆ స్కీం కోసం జట్టు పట్టి కొట్టుకున్న మహిళలు.. కాంగ్రెస్ పై కేటీఆర్ సెటైర్లు

Next Story