- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘ఎంత పాపం చేశావ్ రేవంత్’.. కేటీఆర్ ట్వీట్ వైరల్
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) తీవ్ర విమర్శలు చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) తీవ్ర విమర్శలు చేశారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఇంట్రెస్టింగ్ ట్వీట్ పెట్టారు. ‘‘ఎంత పాపం చేశావ్ రేవంత్.. నిన్నటిదాకా ఆర్టీసీ బస్సుల్లో ఆడబిడ్డల మధ్య కొట్లాట పెట్టావు.. ఇప్పుడు.. మహాలక్ష్మి పేరిట మభ్యపెట్టి అక్కచెల్లెళ్ళు జుట్లు పట్టుకుని కొట్టుకునేలా చేస్తున్నావు. ఇంతకన్నా దుర్మార్గం మరొకటి ఉంటాదా’’ అని కేటీఆర్ ప్రశ్నించారు. కోటిమంది మహిళలను కోటీశ్వరులను చేయడం దేవుడెరుగు కనీసం గ్యారంటీ కార్డులో పెట్టిన రూ.2500 మహాలక్ష్మిని హామీని ఇప్పటికైనా నెరవేర్చు అని డిమాండ్ చేశారు. లేకపోతే నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పోస్టాఫీసులో మహాలక్ష్మి పథకం కోసం మొదలైన ఘర్షణలు మొత్తం తెలంగాణలోని పల్లెపల్లెకు పాకే ప్రమాదం పొంచి ఉందని అన్నారు. తస్మాత్ జాగ్రత్త..!! అని కేటీఆర్ ట్వీట్‌లో పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్‌గా మారింది.






