రోడ్డు పై ఆగి ఉన్న వాహనాన్ని ఢీకొట్టిన స్కూల్ బస్సు

by Batti.Sumithra |

రోడ్డుపై ఆగి ఉన్న ఆటో ట్రాలీ (బొలెరో) వాహనాన్ని విద్యార్థులతో వెళ్తున్న ఓ స్కూల్ బస్సు ఢీకొట్టడంతో బస్సు అద్దాలు ధ్వంసమయ్యాయి.

రోడ్డు పై ఆగి ఉన్న వాహనాన్ని ఢీకొట్టిన స్కూల్ బస్సు
X

దిశ, శంకర్‌పల్లి : రోడ్డుపై ఆగి ఉన్న ఆటో ట్రాలీ (బొలెరో) వాహనాన్ని విద్యార్థులతో వెళ్తున్న ఓ స్కూల్ బస్సు ఢీకొట్టడంతో బస్సు అద్దాలు ధ్వంసమయ్యాయి. ఈ సంఘటన శంకర్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం సాయంత్రం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే శంకర్‌పల్లి మున్సిపల్ పరిధిలోని కృష్ణవేణి టాలెంట్ స్కూల్ బస్సు సోమవారం సాయంత్రం పాఠశాల ముగిసిన అనంతరం విద్యార్థులను ఎక్కించుకుని వెళ్తోంది. సుమారు 25 మంది విద్యార్థులతో మన్సాన్‌పల్లి, మైతాబ్‌ఖాన్‌గూడెం తదితర గ్రామాలకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదంలో బస్సు అద్దాలు పగిలినప్పటికీ విద్యార్థులకు ఎలాంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ విషయమై శంకర్‌పల్లి ఇన్‌స్పెక్టర్ మీర్ ముద్దసిర్ అలీని వివరణ కోరగా, ఈ ఘటనపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని తెలిపారు.

Next Story