- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మైనర్ బాలికపై లైంగిక దాడి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలంలో మైనర్ బాలికపై లైంగిక దాడి జరిగిన ఘటనలో నిందితుడిపై పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు.

దిశ, అశ్వారావుపేట : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలంలో మైనర్ బాలికపై లైంగిక దాడి జరిగిన ఘటనలో నిందితుడిపై పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. మండల కేంద్రంలోని ఓ దుకాణంలో పనిచేస్తున్న 16 ఏళ్ల మైనర్ బాలిక ఆదివారం సాయంత్రం తన గ్రామానికి వెళ్లేందుకు మామిళ్లవారిగూడెం గ్రామానికి చెందిన కోర్స సంతోష్ అనే యువకుడి బైక్‌పై వెళ్లింది. మామిళ్లవారిగూడెం శివారు వద్దకు చేరుకున్న అనంతరం నిందితుడు వాహనాన్ని పొలం మార్గం వైపు మళ్లించి బాలికపై లైంగిక దాడికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. అనంతరం ఆమెను గ్రామంలోని తన అన్న ఇంటి వద్ద దింపి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఇంటికి వెళ్లిన బాలిక ఏడుస్తుండటాన్ని గమనించిన కుటుంబ సభ్యులు వివరాలు అడగగా, జరిగిన విషయాన్ని ఆమె తెలిపింది. దీంతో బాధితురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అశ్వారావుపేట పోలీస్ స్టేషన్‌లో నిందితుడు కోర్స సంతోష్‌పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు.






