ఆ స్కీం కోసం జట్టు పట్టి కొట్టుకున్న మహిళలు.. కాంగ్రెస్ పై కేటీఆర్ సెటైర్లు

by Muthe.Rajitha |

నిజామాబాద్ లోని పోస్టాఫీసుకు వచ్చిన మహిళలు ఒకరిని ఒకరు జుట్టు పట్టి కొట్టుకున్నారు.

ఆ స్కీం కోసం జట్టు పట్టి కొట్టుకున్న మహిళలు.. కాంగ్రెస్ పై కేటీఆర్ సెటైర్లు
X

దిశ, వెబ్ డెస్క్ : నిజామాబాద్ లోని పోస్టాఫీసుకు వచ్చిన మహిళలు ఒకరిని ఒకరు జుట్టు పట్టి కొట్టుకున్నారు. కాంగ్రెస్ ఎన్నికల హామీలలో ఒకటైన మహాలక్ష్మి పథకం(Mahalaxmi Scheme) కింద ప్రభుత్వం ప్రతి మహిళకు రూ.2500 ఇస్తోందని పుకారు షికారు చేస్తోంది. ఈ క్రమంలోనే నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పోస్టాఫీసుకు భారీగా మహిళలు చేరుకున్నారు. అయితే లైన్లో నిలబడే అంశంపై మొదలైన తగాదా చిలికి చిలికి గాలివాన అయ్యి, చివరికి ఒకరిని ఒకరు జుట్లు పట్టుకొని చావబాదుకున్నారు. కర్రలతో కొట్టుకున్నారు.

ఈ గొడవను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా నెట్టింట్లో వైరల్ అయింది. కాగా ఈ వ్యవహారంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) మరోసారి కాంగ్రెస్ ప్రభుత్వంపై దుమ్మెత్తి పోశారు. 'నిన్నటి వరకు బస్సుల్లో మహిళలకు గొడవలు పెట్టావు. ఇపుడు మహాలక్ష్మి పథకం పేరిట మభ్యపెట్టి జుట్లు పట్టుకొని కొట్టుకొని చచ్చేలా చేస్తావా రేవంత్..' అంటూ కేటీఆర్ ప్రశ్నించారు.

Next Story