- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సింగర్ మంగ్లీ అనుచరుల నుంచి ప్రాణహాని.. డీజీపీకి అడ్వకేట్ సుబ్బారావు ఫిర్యాదు
ప్రముఖ గాయని మంగ్లీ (Singer Mangli) అనుచరుల నుంచి తనకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని కోరుతూ అడ్వకేట్ సుబ్బారావు తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డిని ఆశ్రయించారు.

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రముఖ గాయని మంగ్లీ (Singer Mangli) అనుచరుల నుంచి తనకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని కోరుతూ అడ్వకేట్ సుబ్బారావు తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డిని ఆశ్రయించారు. సోమవారం ఆయన డీజీపీని కలిసి ఈ మేరకు ఫిర్యాదు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగ్లీ అనుచరులు, అలాగే కొందరు ఉస్మానియా యూనివర్సిటీ (ఓయూ) విద్యార్థులు తనకు ఫోన్లు చేసి తీవ్ర స్థాయిలో బెదిరింపులకు పాల్పడుతున్నారని సుబ్బారావు ఆరోపించారు. ఈ బెదిరింపుల వెనుక మంగ్లీకి ప్రత్యక్ష సంబంధం లేకపోయినా, పరోక్షంగా ఆమె హస్తం ఉందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు.
మంగ్లీతో పరిచయం లేదు..
గతంలో తనకు మంగ్లీతో ఎలాంటి పరిచయం లేదని సుబ్బారావు స్పష్టం చేశారు. తాను ఏనాడూ ఆమెను ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ విమర్శించలేదన్నారు. కానీ, ఆవిడే కావాలని తన పేరును తెరపైకి తీసుకువచ్చారని ఆరోపించారు. మధు నాయక్ ఎవరో తెలియదు అని మంగ్లీ చెప్పడంలో నిజం లేదన్నారు. కేవలం ఈవెంట్స్, ప్రోగ్రామ్స్ కోసం మాత్రమే కాకుండా, అంతకు మించి మంగ్లీ అతన్ని పలుమార్లు కలిసిందని సుబ్బారావు ఆరోపించారు. తాను ఎవరినీ డబ్బులు డిమాండ్ చేయలేదని, ఈ విషయానికి సంబంధించి తన వద్ద పక్కా ఆధారాలు ఉన్నాయని ఆయన వెల్లడించారు.
డీజీపీ హామీ..! పోరాటం ఆగదు..
విచారణ పేరుతో తనను అవమానించిన పంజాగుట్ట సీఐకి ఇప్పటికే నోటీసులు అందాయని సుబ్బారావు తెలిపారు. తన ఫిర్యాదుపై డీజీపీ శివధర్ రెడ్డి సానుకూలంగా స్పందించారని, తనకు తగిన భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చారని సుబ్బారావు తెలిపారు. ఎన్ని బెదిరింపులు వచ్చినా వెనక్కి తగ్గేది లేదని, మైక్రోఫైనాన్స్ కేసులో బాధితులకు న్యాయం జరిగే వరకు తన న్యాయ పోరాటం కొనసాగుతుందని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
క్యాస్టింగ్ కౌచ్ పై హన్సిక వివాదాస్పద వ్యాఖ్యలు.. ఏకిపారేస్తున్న నెటిజన్లు






