బాసర ఆలయ అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి భూమిపూజ

by Jakkula.Mamatha |   (  Updated:2026-04-06 13:04:04  IST  )

దక్షిణ భారతంలోనే ఉన్న ఏకైక సరస్వతీ అమ్మవారి పుణ్యక్షేత్రం బాసర ఆలయ అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టారు.

బాసర ఆలయ అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి భూమిపూజ
X

దిశ, ప్రతినిధి నిర్మల్: దక్షిణ భారతంలోనే ఉన్న ఏకైక సరస్వతీ అమ్మవారి పుణ్యక్షేత్రం బాసర ఆలయ అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టారు. ఈ మేరకు రూ.225 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ప్రస్తుతం 20 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న బాసర ఆలయాన్ని సుమారు 60 వేల చదరపు అడుగుల మేరకు విస్తరించనున్నారు. కొత్త ఆలయ శిఖరాలు, మండపాలు, మాడవీధులు, ఇతర అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేశారు. పారతో తవ్వి సీఎం చేతుల మీదుగా పనులు ప్రారంభించారు. వచ్చే ఏడాది గోదావరి పుష్కరాల నాటికి ఆలయ అభివృద్ధి పనులను వేగంగా చేపట్టాలని ఈ సందర్భంగా అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.

వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ పనులు ప్రారంభించారు. సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రతిష్టాత్మక బాసర ఆలయానికి మంచి రోజులు వచ్చాయని వేద పండితులు ఈ సందర్భంగా సీఎం ఆశీర్వదించారు. బాసర అమ్మవారు సీఎం రేవంత్ రెడ్డిని తన కుమారుడు రూపంలో ఆశీర్వదించిందని పేద పండితులు అభిప్రాయపడ్డారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు కొండా సురేఖ, జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి, పార్లమెంట్ సభ్యులు జీ నగేష్ , శాసనసభ్యులు రామారావు పటేల్ మహేశ్వర్ రెడ్డి, బుజ్జి పటేల్ కాంగ్రెస్ సీనియర్ నేతలు శ్రీహరి రావు ఇంద్రకరణ్ రెడ్డి నారాయణ రావు పటేల్, గ్రామ సర్పంచ్ వెంకటేష్ గౌడ్ దేవాదాయ శాఖ అధికారులు పాల్గొన్నారు.

బాసరలో సీఎం రేవంత్ రెడ్డి మనవడి అక్షరాభ్యాసం పూర్తి

Next Story