- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
BIG BREAKING : కేటీఆర్‌కు ఏసీబీ నోటీసులు
తాజాగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) కు ఏసీబీ నోటీసులు (ACB Notice) జారీ చేసింది. ఫార్ములా ఈ కేసులో (Formula E Case) విచారణకు హాజరు కావాలని ఏసీబీ నోటీసుల్లో పేర్కొంది.

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ నేతలను వరుస నోటీసులు వెంటాడుతున్నాయి. ఇటీవలే కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కేసీఆర్, హరీష్ రావులకు నోటీసులు అందిన విషయం తెలిసిందే. తాజాగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) కు ఏసీబీ మరోసారి నోటీసులు (ACB Notice) జారీ చేసింది. ఫార్ములా ఈ కేసులో (Formula E Case) విచారణకు హాజరు కావాలని ఏసీబీ నోటీసుల్లో పేర్కొంది. ఈ నెల 28న విచారణకు హాజరు కావాలని ఏసీబీ నోటీసులు పంపిందని, యూకే పర్యటన తర్వాత విచారణకు హాజరవుతానని కేటీఆర్ తెలిపారు. ఈ మేరకు ఎక్స్ లో కేటీఆర్ ఒక పోస్ట్ చేశారు.
"ఫార్ములా E కేసులో మే 28న విచారణకు హాజరు కావాలని ACB నాకు నోటీసు ఇచ్చింది. ఈ కేసు పూర్తిగా రాజకీయ వేధింపులతో కూడుకున్నది అయినప్పటికీ చట్టాన్ని గౌరవించే పౌరుడిగా.. ఖచ్చితంగా ఏజెన్సీలకు సహకరిస్తాను. అనేక పనుల నిమిత్తం నేను UK & USAకి చాలా ముందుగానే బయలుదేరాలని ప్లాన్ చేసుకున్నాను. నేను తిరిగి వచ్చిన తర్వాత వారి ముందు హాజరవుతాను. ACB అధికారులకు కూడా ఇదే విషయాన్ని లిఖితపూర్వకంగా తెలియజేశాను. కానీ రాజకీయ ప్రతీకార దాహంతో ఉన్న రేవంత్ రెడ్డిని నేను అభినందించాలి. 48 గంటల క్రితం నేషనల్ హెరాల్డ్ కేసులో ED ఆయన పేరును ఛార్జిషీట్‌లో చేర్చగా.. 24 గంటల తర్వాత రేవంత్ రెడ్డి ప్రధాని మోడీతో సహా బిజెపి అగ్రనేతలతో ఈ విషయమై చర్చించినట్లు కనిపిస్తోంది. మనీలాండరింగ్ కేసులో ప్రమేయం ఉన్నందుకు ఒక్క బిజెపి నాయకుడి నుండి కూడా రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ఒక్క మాట కూడా లేదు. ఈ రోజు నాకు ACB నుండి నోటీసు వచ్చింది. నిర్వాహకుడిగా, నాయకుడిగా కూడా అతను విఫలం కావచ్చు. కానీ అతను చౌకబారు ప్రతీకార రాజకీయాల్లో తనను తాను నిరూపించుకుంటున్నాడు. BRSను చూస్తే రేవంత్ రెడ్డికి భయమని చెప్పడంలో ఎలాంటి సంకోచం లేదు" అని కేటీఆర్ చేసిన పోస్టులో పేర్కొన్నారు.






