MLC KAVITHA: కేటీఆర్‌కు ఏసీబీ నోటీసులు..స్పందించిన కవిత!

by Ajay Maddhiboyina |   (  Updated:2025-05-27 11:47:12  IST  )

ఫార్ములా రేస్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు నోటీసులు ఇవ్వడంపై ఎమ్మెల్సీ కవిత స్పందించారు. తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోడానికి,

MLC KAVITHA: కేటీఆర్‌కు ఏసీబీ నోటీసులు..స్పందించిన కవిత!
X

దిశ, వెబ్ డెస్క్: ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు నోటీసులు ఇవ్వడంపై ఎమ్మెల్సీ కవిత స్పందించారు. తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోడానికి, ప్రజా సమస్యల నుంచి దృష్టి మళ్లించడానికి కుట్రపూరితంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేటీఆర్‌కు నోటీసులు జారీ చేయడాన్ని ఖండిస్తున్నట్టు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుటిల రాజకీయ క్రీడలో భాగంగానే ఏసీబీ నోటీసులు జారీ చేసినట్లు స్పష్టమవుతోందన్నారు. తమ పార్టీ నాయకులకు వరుస నోటీసులు జారీ చేయడం వెనుక రాజకీయ దురుద్దేశం ఉన్నట్లు తేటతెల్లమైందన్నారు. ఎవరెన్ని ఇబ్బందులు పెట్టాలని ప్రయత్నించినా తట్టుకొని నిలబడ్డ చరిత్ర కేసీఆర్ సైనికులదని అన్నారు.

ఇదిలా ఉంటే క‌విత ఇటీవ‌ల కేసీఆర్‌కు రాసిన లేఖలో పార్టీలో ప‌రిస్థితుల‌పై అసంతృప్తి వ్య‌క్తం చేసిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా అమెరికా నుండి వ‌చ్చిన త‌ర‌వాత కేసీఆర్ దేవుడే కానీ ఆయ‌న చుట్టూ దెయ్యాలు ఉన్నారంటూ కామెంట్లు చేశారు. ఈ నేప‌థ్యంలో ఆమె పార్టీ వీడ‌తారని, కొత్త పార్టీ పెడ‌తార‌ని పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రిగింది. క‌విత అసంతృప్తికి కార‌ణం కేటీఆరే అంటూ ప్ర‌తిప‌క్షాలు విమ‌ర్శ‌లు చేశాయి. ఈ క్ర‌మంలో ఆమె కేటీఆర్‌కు ఏసీబీ నోటీసులు ఇవ్వడంపై స్పందించడం ఆసక్తికరంగా మారింది.

Next Story