Padma Awards: తెలంగాణ నుంచి మొత్తం 7 గురికి ‘పద్మ’ అవార్డులు

by Ramesh Naini |   (  Updated:2026-01-25 13:57:33  IST  )

దేశ అత్యున్నత పౌర పురస్కారాలైన 'పద్మ' అవార్డులను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.

Padma Awards: తెలంగాణ నుంచి మొత్తం 7 గురికి ‘పద్మ’ అవార్డులు
X

దిశ, డైనమిక్ బ్యూరో: దేశ అత్యున్నత పౌర పురస్కారాలైన 'పద్మ' అవార్డులను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 2026 ఏడాదికి గానూ గణతంత్ర దినోత్సవం సందర్భంగా మొత్తం 131 మందికి ఈ అవార్డులను ఖరారు చేసింది. ఇందులో 5 పద్మ విభూషణ్, 13 పద్మభూషణ్, 113 పద్మశ్రీ అవార్డులు ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల నుంచి మొత్తం 11 మందిని ఈ పురస్కారాలు వరించాయి. ఇందులో తెలంగాణ నుంచి ఏడుగురు, ఆంధ్రప్రదేశ్ నుంచి నలుగురు ఎంపికయ్యారు. వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన ప్రముఖులకు కేంద్రం ఈ గౌరవాన్ని దక్కించింది.

తెలుగు రాష్ట్రాల్లో సందడి..

కళా రంగంలో విశేష కృషి చేసిన మాజీ ఎంపీ, నటుడు మాగంటి మురళీమోహన్‌తో పాటు, ప్రముఖ నటుడు రాజేంద్ర ప్రసాద్‌లను పద్మశ్రీ అవార్డు వరించింది. ఆంధ్రప్రదేశ్ నుంచి గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ (కళలు), వెంపటి కుటుంబ శాస్త్రి (సాహిత్యం) కూడా పద్మశ్రీ జాబితాలో నిలిచారు.

తెలంగాణ నుంచి పద్మశ్రీ అవార్డు గ్రహీతలు వీరే..

తెలంగాణ గడ్డపై వివిధ రంగాల్లో అద్భుత ప్రతిభ కనబరిచిన ఏడుగురు ప్రముఖుల జాబితా ఇలా ఉంది..

1.గడ్డమనుగు చంద్రమౌళి, సైన్స్ అండ్ ఇంజనీరింగ్, తెలంగాణ

2.దీపికారెడ్డి, కళా రంగం, తెలంగాణ

3.గూడూరు వెంకట్ రావు, వైద్య రంగం, తెలంగాణ

4.కృష్ణమూర్తి బాలసుబ్రహ్మణ్యన్, సైన్స్ అండ్ ఇంజనీరింగ్, తెలంగాణ

5.కుమారస్వామి తంగరాజ్, సైన్స్ అండ్ ఇంజనీరింగ్, తెలంగాణ

6.పాల్కొండ విజయ్ ఆనంద్ రెడ్డి, వైద్య రంగం, తెలంగాణ

7.రామారెడ్డి మామిడి (మరణానంతరం), పశుసంవర్ధక శాఖ, తెలంగాణ

READ MORE ....

Padma Bhushan-2026: 13 మందికి పద్మభూషణ్ అవార్డులు.. యూఎస్ పౌరులకు సైతం

Next Story