Telangana Budget :అసెంబ్లీ వద్ద టెన్షన్.. టెన్షన్.. భారీగా మోహరించిన పోలీసులు

by Disha Web Desk 19 |
Telangana Budget :అసెంబ్లీ వద్ద టెన్షన్.. టెన్షన్.. భారీగా మోహరించిన పోలీసులు
X

దిశ, తెలంగాణ బ్యూరో: విద్యారంగానికి 30 శాతం నిధులు కేటాయించాలని పీడీఎస్‌యూ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది.ఈ నేపథ్యంలో అసెంబ్లీ బడ్జెట్ సెషన్ జరుగుతున్న సమయంలో ముట్టడికి యత్నించింది. ఈ సందర్భంగా అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో ఘర్షణ వాతావరణం ఏర్పడింది. పోలీసులు, పీడీఎస్‌యూ నాయకుల మధ్య తీవ్రమైన తోపులాట జరిగింది. వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు రాంగోపాల్ పేట్, ముషీరాబాద్ స్టేషన్‌కు తరలించారు. దీంతో అసెంబ్లీ దగ్గర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అసెంబ్లీ తో పాటు పరిసర ప్రాంతాల్లో భారీగా పోలీసులు మోహరించారు.

ఈ సందర్భంగా పీడీఎస్‌యూ నాయకులు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర బడ్జెట్‌ను సవరించాలని డిమాండ్ చేశారు. మంత్రి హరీష్ రావు విద్యారంగానికి కేటాయించిన బడ్జెట్ కేవలం జీతభత్యాలకే సరిపోవని విమర్శించారు. పెండింగ్‌లో ఉన్న 5 వేల కోట్ల స్కాల‌ర్ షిప్స్, ఫీజు రీయంబర్స్‌మెంట్‌లను విడుదల చేయాలన్నారు. ప్రైవేటు యూనివర్సిటీలు, కార్పొరేట్ విద్యా సంస్థలను రద్దు చేయాలని, నూతన జాతీయ విద్యా విధానం నిలిపివేస్తూ అసెంబ్లీలో తీర్మానం చేయాలని ప్రధాన డిమాండుగా తెలిపారు. ప్రభుత్వ విద్యాసంస్థల్లో మౌలిక వసతులు కల్పించాలని, ఖాళీగా ఉన్న అన్ని రకాల పోస్టులను భర్తీ చేయాలని, విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

Read more:

Telangana Budget 2023 : నిరుద్యోగులకు మరోసారి నిరాశే.. బడ్జెట్‌లో ఆ ఊసే ఎత్తని తెలంగాణ సర్కార్


Next Story

Most Viewed