Telangana Budget 2023 : నిరుద్యోగులకు మరోసారి నిరాశే.. బడ్జెట్‌లో ఆ ఊసే ఎత్తని తెలంగాణ సర్కార్!

by Disha Web Desk 19 |
Telangana Budget 2023 : నిరుద్యోగులకు మరోసారి నిరాశే.. బడ్జెట్‌లో ఆ ఊసే ఎత్తని తెలంగాణ సర్కార్!
X

దిశ, డైనమిక్ బ్యూరో: 2023-24 వార్షిక బడ్జెట్‌లో కేసీఆర్ సర్కార్ కీలక హామీలను విస్మరించింది. నిరుద్యోగ భృతి, గిరిజన బంధు వంటి హామీలను పట్టించుకోలేదు. 2019 ఎన్నికల సమయంలో కేసీఆర్ ఇచ్చిన ప్రధానమైన హామీలో నిరుద్యోగులకు రూ.3వేల అలవెన్స్ ఇస్తామని ప్రకటించారు. ఈ హామీ ఇచ్చి నాలుగేళ్లు గడుస్తున్నా ఇప్పటి వరకు కార్యచరణ తీసుకోలేదు. తాజాగా ఎన్నికల సంవంత్సరంలోనైనా ఈ హామీని నెరవేరుస్తాని అంతా ఆశిచించినా బడ్జెట్‌లో ఆ ఊసే ఎత్తకపోవడంతో నిరుద్యోగులు తీవ్ర నిరాశ చెందుతున్నారు. ఇదిలా ఉంటే గతేడాది సెప్టెంబర్‌లో ఆదివాసీ, బంజారాల ఆత్మీయ సభలో సీఎం కేసీఆర్ గిరిజనబంధుపై ప్రకటన చేశారు. దళిత బంధు తరహాలోనే అర్హులైన గిరిజనులకు రూ.10 లక్షల ఆర్థిక సాయం అందజేస్తామన్నారు. కానీ బడ్జెట్ లో ఈ హామీ గురించిన ప్రస్తావన లేకపోవడంతో గిరిజనులు తీవ్ర నిరాశ చెందుతున్నారు. మరోవైపు ఖాళీ స్థలాలు ఉన్న వారికి ఇంటి నిర్మాణం కోసం రూ.5 లక్షల ఆర్థిక సాయం చేస్తామని గతంలో ప్రకటించింది. అయితే తాజాగా బడ్జెట్లో రూ.3 లక్షలు ఇస్తామని ఆర్థిక మంత్రి స్పష్టం చేశారు. ఈ పథకానికి 7,890 కోట్లు ప్రతిపాదించారు.

Also Read..

Telangana Budget 2023 : ఈటల రియాక్షన్ ఇదే!


Next Story

Most Viewed