- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Medaram Jatara 2026 : 1998 ట్రిప్పులు 88,686 మంది ప్రయాణికుల ప్రయాణం

దిశ, హనుమకొండ కలెక్టరేట్: మేడారం జాతరకు టీజీఎస్ ఆర్టీసీ వరంగల్ రీజనల్ ఆధ్వర్యంలో ప్రత్యేక బస్సులు నడిపిస్తున్నారు. మేడారానికి వరంగల్ రీజనల్ ఆధ్వర్యంలో నేటి వరకు ఆర్టీసీ 1998 ట్రిప్పులలో 88686 మంది ప్రయాణికులను చేరవేసింది. ముఖ్యంగా వరంగల్ రీజనల్ పరిధిలోని ప్రధాన కేంద్రాలలో బస్టాండ్లను ఏర్పాటు చేసి ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లను చేశారు ఆర్టీసీ అధికారులు. ప్రధానంగా మేడారంలో 50 ఎకరాలకు పైగా విస్తీర్ణంతో తాత్కాలిక ఆర్టీసీ బస్ స్టేషన్ ఏర్పాటుచేసి తొమ్మిది కిలోమీటర్ల మేర 20వేల మంది నిలబడే విధంగా క్యూలైన్లు ఏర్పాటు చేశారు. దానితో పాటు 1000 బస్సులు పార్కింగ్ చేసే విధంగా 25.76 ఎకరాల విస్తీర్ణంలో పార్కింగ్ స్థలం ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ ప్రవాహాన్ని నిరంతరం పర్యవేక్షించేందుకు కమాండ్ కంట్రోల్ సెంటర్ ను ఏర్పాటు చేశారు. జాతర జరుగుతున్న రోజులలో ఆర్టీసీ సిబ్బంది అప్రమత్తంగా ఉండి ప్రయాణికులకు ఎలాంటి ఆటంకాలు జరగకుండా సేవలు అందించేందుకు సిద్ధంగా ఉన్నారు.
MORE NEWS ......






