- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వివో నుంచి కొత్త 5G ఫోన్.. స్పెషల్లీ మేడ్ ఫర్ ఫొటో లవర్స్
తాజాగా వివో మార్కెట్లోకి కొత్త 5Gస్మార్ట్ మొబైల్ ను తీసుకురానుంది. స్పెషల్ గా ఫొటోలు, వీడియోలు తీసుకునే వారికోసం మూడు కెమెరాలను బెస్ట్ మెగా పిక్సెల్స్ తో అందిస్తోంది.

దిశ, వెబ్‌డెస్క్: లైట్ వెయిట్ మొబైల్స్ లిస్టులో వివో బ్రాండ్ మొబైల్స్ ముందు వరుసలో ఉంటాయనడంలో సందేహం లేదు. ఆండ్రాయిడ్ అప్డేట్స్, మొబైల్ ఆపరేటింగ్ కూడా చాలా ఈజీ. కాకపోతే కెమెరా క్వాలిటీగా కావాలనుకుంటే కాస్త రేటెక్కువ పెట్టి మంచి ఫీచర్స్ ఉన్న మొబైల్ ను తీసుకోవాలి. ధర విషయంలో వివో అస్సలు కాంప్రమైజ్ అవ్వదు. మొబైల్ ఛార్జింగ్, వాయిస్ కాల్స్, వీడియో కాల్స్.. అన్నింటా ది బెస్ట్ గా ఉంటుంది. తాజాగా వివో మార్కెట్లోకి కొత్త 5Gస్మార్ట్ మొబైల్ ను తీసుకురానుంది. స్పెషల్ గా ఫొటోలు, వీడియోలు తీసుకునే వారికోసం మూడు కెమెరాలను బెస్ట్ మెగా పిక్సెల్స్ తో అందిస్తోంది.
జైస్ పార్ట్నర్ షిప్ తో Vivo x200T మొబైల్ ను ధర, ఫీచర్లు, ఇతర వివరాలు ఇలా ఉన్నాయి. ఈ ఫోన్ న 6.67 అంగుళాలతో ఫుల్ హెచ్ డీ ప్లస్ అమోల్డ్ డిస్ ప్లేతో రూపొందించారు. 120Hzరిఫ్రెష్ రేటు, 5000 నిట్స్ పీక్ బ్రైట్ నెస్, HDR 10+ సపోర్ట్ ఉంటుంది. 3.73 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 9400+ ప్రాసెసర్, ఐపీ 68, ఐపీ 69 రేటింగ్ తో డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ కూడా ఉంది. అంతేకాదు.. గ్లాస్ అల్యూమినియం ఫ్రేమ్ బాడీతో ఈ ఫోన్ మార్కెట్లోకి విడుదల చేయనుంది.
కెమెరా విషయానికొస్తే.. ఈ ఫోన్లో మూడు కెమెరాలను 50 ఎంపీతో తీసుకొస్తన్నారు. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ తో 50 ఎంపీ ప్రైమరీ కెమెరా, 50 ఎంపీ అల్ట్రావైడ్ యాంగిల్, 50 ఎంపీ పెరిస్కోప్ సెన్సర్ ను అమర్చారు. 100x వరకూ హైపర్ జూమ్, 20x వరకూ మాక్రోషాట్స్ తీస్కోవచ్చు. ఫ్రంట్ కెమెరాను 32 ఎంపీతో ఇచ్చారు. 4k, 60FPSతో వీడియోలు రికార్డ్ చేయొచ్చు. బ్యాటరీ మాత్రం కొత్తగా మార్కెట్లోకి రానున్న రియల్ మీ, ఎంఐ ఫోన్లను బీట్ చేయలేకపోయిందనే చెప్పాలి. 6200mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్, 40W వైర్ లెస్ ఫాస్ట్ ఛార్జింగ్ కూడా ఉంది. ఈ బ్యాటరీతో 35 గంటలపాటు యూట్యూబ్ ప్లేబ్యాక్, 6 గంటలు వీడియో రికార్డ్ చేయవచ్చని వివో వెల్లడించింది. 5G, వైఫై 7, బ్లూటూత్ 6.0, యూఎస్ బీ టైప్ C పోర్ట్ ఉన్నాయి. భారత్ లో Vivo x200T రెండు వేరియంట్లలో వస్తోంది. 12జీబీ విత్ 256 జీబీ ధర రూ.59,999గా, 12 జీబీ విత్ 512 జీబీ ధర రూ.69,999గా నిర్ణయించింది. ఐదేళ్లు ఓఎస్ అప్డేట్స్, 7 ఏళ్లు సెక్యూరిటీ అప్డేట్స్ ఇస్తామని హామీ ఇచ్చింది. ప్రస్తుతం ప్రీ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి.
READ MORE ....






