ఉచితంగా Amazon Prime Membership.. ఈ చిన్న ట్రిక్ ట్రై చేయండి

by Disha Web Desk 4 |
ఉచితంగా Amazon Prime Membership.. ఈ చిన్న ట్రిక్ ట్రై చేయండి
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ అమెజాన్ సబ్‌స్క్రిప్షన్ ను ఉచితంగా పొందవచ్చు. ఒక చిన్న ట్రిక్ తో 84 రోజుల పాటు ఉచితంగా అమెజాన్ ప్రైమ్ చూడవచ్చు. ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్ టెల్ తమ కస్టమర్లకు రెండు ప్రీపెయిడ్ ప్లాన్లపై ఉచితంగా అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్ ను అందిస్తోంది. ఎయిర్ టెల్ ప్రీపెయిడ్ కస్టమర్లు రూ.699తో రీఛార్జ్ చేసుకుంటే రోజుకు 3జీబీ డేటాతో పాటు ఉచిత కాలింగ్, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు ఉచితంగా పొందవచ్చు. ఈ ప్లాన్ వాలిడిటీ 56 రోజులు. ఈ 56 రోజుల పాటు అమెజాన్ ప్రైమ్ సబ్ స్క్రిప్షన్ ఉచితంగా లభిస్తుంది. ఇక రూ.999 ప్రీపెయిడ్ ప్లాన్ తో రోజుకు 2.5 జీబీ డేటాతో పాటు ఉచిత కాలింగ్, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు ఫ్రీగా పొందవచ్చు. ఈ ప్లాన్ వాలిడిటీ 84 రోజులు కావడంతో.. ఈ 84 రోజుల పాటు అమెజాన్ ప్రైమ్ ఉచితంగా లభిస్తుంది. ఇక ఫాస్టాగ్ పై రూ.100 క్యాష్ బ్యాక్ తో పాటు సోనీ లివ్, ఈరోస్ నౌ, హోయి2చి, మనోరమ మ్యాక్స్, లయన్స్ గేట్ ప్లే వంటి ఛానల్స్ ను ఫ్రీగా చూడోచ్చు.

అమెజాన్ ప్రైమ్ సబ్ స్క్రిప్షన్ ఉండటం వల్ల అమెజాన్ ప్రైమ్ వీడియోస్ లో సినిమాలు చూసుకోవచ్చు. అంతేకాకుండా అమెజాన్ ఈ కామర్స్ వెబ్ సైట్ లోని ప్రొడక్ట్స్ పై అదనంగా ఆఫర్లతో పాటు భారీ డిస్కౌంట్స్ లభిస్తాయి. అంతేకాకుండా ఫాస్ట్ డెలివరీ ఆప్షన్ తో పాటు ఫ్రీ డెలివరీ పొందవచ్చు.

ప్రేమను గెలవటం కోసం ఆ వ్యక్తి ఏం చేసాడో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.

Advertisement
Next Story

Most Viewed