బాలికపై కీచక టీచర్ అరాచకం.. స్పెషల్ క్లాస్ అంటూ ఏడాదిగా..

by  |

దిశ, వెబ్‌డెస్క్: దేశంలో ఎక్కడ చూసినా ఆడవారిపై అఘాయిత్యాలే.. చిన్నా లేదు పెద్దా లేదు. చదువుకున్నవారు లేదు.. చదువురానివారు లేదు.. ఉన్నత వృత్తిలో ఉన్నవారు లేదు.. అసలు ఉద్యోగం లేనివారు లేదు..కామవాంఛతో రగిలిపోతూ కామాంధులుగా మారి కొందరు మగాళ్లు చేస్తున్న అఘాయిత్యాలకు అంతే లేకుండా పోతుంది. మహిళలు బయటికి రావడానికే భయపడిపోతున్నారు. ఆఫీస్, స్కూల్, గుడి, నడిరోడ్డుపై కూడా భయంలేకుండా నడవలేని దుస్థితి దాపురించింది. ఇక తాజాగా ఒక ఉపాధ్యాయుడు తన దగ్గరకు పాఠాలు చెప్పించుకోవడానికి వచ్చిన ఓ విద్యార్థిని బలవంతంగా అనుభవించి ఆమెను గర్భవతిని చేసిన దారుణ ఘటన విజయనగరం జిల్లాలో వెలుగు చూసింది.

వివరాలలోకి వెళితే.. విజయనగరం జిల్లా గంట్యాడ మండలానికి చెందిన చిన్నా(47)ప్రభుత్వ ఉద్యోగం రాకపోవడంతో ట్యూషన్లు చెప్పేవాడు. కరోనా కారణంగా స్కూల్స్ మూతపడడంతో విద్యార్థులు ట్యూషన్స్ కోసం చిన్నా ఇంటికి వచ్చేవారు. ఇక ట్యూషన్ కి అదే గ్రామానికి చెందిన 16 ఏళ్ల బాలిక 10 వ తరగతి కావడంతో ట్యూషన్ కి వెళ్తోంది. ఈ క్రమంలోనే ఆ అమ్మాయిపై ట్యూషన్‌ మాస్టారు చిన్నా కన్నేశాడు. మిగిలిన విద్యార్థులంతా సెంటర్ నుంచి వెళ్లిపోయాక.. స్పెషల్ కాస్లులంటూ.. ఆ బాలికను లోబరుచుకున్నాడు. ఇలా ఏడాదిగా ఆ బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఇక ఈ నేపథ్యంలోనే బాలిక నీరసంగా కనిపించడంతో వైద్యుల వద్దకు తీసుకెళ్లిన తలిదండ్రులకు పిడుగులాంటి వార్త బయటపడింది. బాలిక గర్భవతి అని, అందుకే నీరసంగా ఉంటుందని తెలుపడంతో తల్లిదండ్రులు బాలికను నిలదీశారు. దీంతో వెంటనే ఆ బాలిక తల్లిదండ్రులు దిశ పోలీస్ స్టేషన్ ని ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు చిన్నాను అదుపులోకి తీసుకున్నారు.

అమ్మాయి బాగుందని నెంబర్ అడుగుతున్నారా?.. ఇది మీకోసమే..

ప్రభుత్వం సంచలన నిర్ణయం.. సెక్స్ కోసం సబ్సిడీ.. వ్యభిచారానికి చట్టబద్దత!

కంటెంట్ రైటర్లు కావాలి!
సంచలన కథనాలతో తెలుగు రాష్ట్రాల్లో దూసుకుపోతున్న దిశ వెబ్‌సైట్‌లో పని చేయడానికి సీనియర్, జూనియర్ కంటెంట్ రైటర్లు కావాలి.
పొలిటికల్, వైరల్, సినిమా, బిజినెస్, లైఫ్‌స్టైల్ కంటెంట్ రాసే వారికి ప్రాధాన్యం ఉంటుంది. ప్రతిభను బట్టి వేతనం ఉంటుంది.
ఆసక్తి ఉన్నవాళ్లు నెంబరు 79958 66670 కు తమ బయోడేటా వాట్సాప్ చేయండి. లేదా
వాకిన్ ఇంటర్వ్యూ కోసం కింది అడ్రస్‌లో సంప్రదించగలరు.
దిశ, ఫస్ట్ ఫ్లోర్, లుంబిని రాక్‌డేల్ ఈనాడు ఆఫీసు వెనకాల సోమాజీగూడ, హైదరాబాద్.

Next Story

Most Viewed