- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Delhi: మందిర్ మార్గ్ పీఎస్‌కు చేరుకున్న సోనియా గాంధీ.. కాంగ్రెస్ నేతలకు పరామర్శ
ఢిల్లీ పోలీసుల అదుపులో ఉన్న విపక్ష నేతలను పరామర్శించేందుకు కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ మందిర్ మార్గ్ పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు.

దిశ, వెబ్‌డెస్క్: దేశ రాజధాని ఢిల్లీ (Delhi)లో పొలిటికల్ హాట్ ఇంకా చల్లారలేదు. లోక్ కళ్యాణ్ మార్గ్ (Lok Kalyan Marg) వద్ద ఆందోళన చేపట్టిన ప్రతిపక్ష నేతలు, ప్రియాంక గాంధీ సహా పలువురు ప్రముఖ నాయకులను ఢిల్లీ పోలీసులు ముందస్తు చర్యగా అదుపులోకి తీసుకుని మందిర్ మార్గ్ (Madir Marg) పోలీస్ స్టేషన్‌కు, ఇక రాహుల్ గాంధీని మోడల్ టౌన్‌లోని ఛత్రసాల్ స్టేడియానికి పోలీసులు తరలించినట్లుగా కాంగ్రెస్ నేతలు వెల్లడించారు. తమ పార్టీ నాయకులు, కార్యకర్తలు కస్టడీలో ఉన్నారన్న సమాచారం తెలియగానే సోనియా గాంధీ (Sonia Gandhi) హుటాహుటిన స్వయంగా పోలీస్ స్టేషన్ వెళ్లి పరామర్శించారు. అదేవిధంగా అదుపులోకి తీసుకున్న నేతల క్షేమసమాచారాలు తెలుసుకునేందుకు, వారికి మద్దతుగా నిలిచేందుకే సోనియా గాంధీ మందిర్ మార్గ్‌కు వచ్చారని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. పోలీస్ స్టేషన్ వద్ద కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు భారీగా చేరుకోవడంతో అక్కడ భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.






